ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో( February ) పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించరు.ఫిబ్రవరి నెలను అన్ సీజన్ గా మేకర్స్ భావిస్తారనే సంగతి తెలిసిందే.2020 సంవత్సరంలో భీష్మ( Bheeshma Movie ) బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా 2021లో ఉప్పెన,( Uppena ) 2022లో డీజే టిల్లూ( DJ Tillu ) సినిమాలు విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.2023 సంవత్సరంలో సర్ మూవీ( Sir Movie ) విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే.
2024 సంవత్సరం ఫీబ్రవరి నెలలో ఊరుపేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) సినిమా విడుదలై సక్సెస్ సాధించడం గమనార్హం.ఈ ఏడాది అలా హిట్ గా నిలిచిన సినిమాల జాబితాలో తండేల్( Thandel ) నిలిచింది.80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో ఒకింత సంచలనాలు సృష్టించింది.సాయిపల్లవి హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఫిబ్రవరి నెలలో ఇతర సినిమాలు కూడా ఎక్కువగా విడుదలైనా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సక్సెస్ సాధించినా ఆ సినిమా తెలుగు సినిమా కాదు కాబట్టి ఈ జాబితాలో చేర్చలేము.పట్టుదల, లైలా, బ్రహ్మ ఆనందం, జాబిలమ్మ నీకు అంత కోపమా, రామం రాఘవం, బాపు సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిలయ్యాయి.

ఫిబ్రవరి నెల చివరి వారంలో శబ్దం, మజాకా సినిమాలు విడుదల కాగా శబ్దం మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా మజాకా మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.ఫిబ్రవరి నెలలో భవిష్యత్తులో కూడా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.ఫిబ్రవరి నెల బాక్సాఫీస్ కు ఒక భారీ హిట్ ను అందిస్తుండటం గమనార్హం.