2006 నాటి ఎన్ఆర్ఐ పంకజ్ త్రివేది( NRI Pankaj Trivedi ) హత్య కేసులో 10 మంది దోషులకి గుజరాత్ కోర్ట్( Gujarat Court ) జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన కేసులో 84 మంది సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం శుక్రవారం అదనపు సెషన్స్ జడ్జి భరత్ జాదవ్ తుది తీర్పును వెలువరించారు.
ఆధ్యాత్మిక శాఖ అయిన స్వాధ్యయ్ పరివార్ సభ్యులైన నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలను నిర్ధారించారు.
మృతుడు పంకజ్ త్రివేది ఓ ఎన్ఆర్ఐ.
( NRI ) ఇతనికి స్వాధ్యయ్ పరివార్‌తో సంబంధాలు ఉన్నాయి.ఆయనను 2006 జూన్ 15న అహ్మదాబాద్‌లోని ఎల్లిస్బ్రిడ్జ్ జింఖానా సమీపంలో బేస్‌బాల్ బ్యాట్లు, ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన 2001 భుజ్ భూకంప బాధితులకు సాయం చేయడానికి స్వాధ్యయ్ పరివార్( Swadhyay Parivar ) నడుం బిగించింది.ఈ క్రమంలో విదేశాల నుంచి భారీ ఎత్తున నిధులు రావడానికి పంకజ్ ఈ సంస్థకు సాయం చేశాడు.
అయితే నిధులు ఏం చేస్తున్నారు? ఎలా ఖర్చు చేస్తున్నారు? అని అడగటంతో సంస్థ ప్రతినిధులతో పంకజ్‌కు విభేదాలు వచ్చాయి.

ఆ సంస్థ కార్యకలాపాలను త్రివేది ప్రశ్నించడం ప్రారంభించడం, నిధుల దుర్వినియోగంపై తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని స్వాధ్యయ్ అగ్రనాయకత్వానికి పంకజ్ లేఖ రాయడంతో నిందితులు రగిలిపోయారు.అయితే నిందితులతో పాటు పలువురు కీలక వ్యక్తుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆ సమావేశం జరగలేదు.ఈ నేపథ్యంలో పంకజ్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.
దీంతో తనకు , తన మిత్రులకు ఏదైనా జరిగితే స్వాధ్యయ్ లోని 30 మందిదే బాధ్యత అని నాటి సీఎంకు పంకజ్ లేఖ రాశాడని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

త్రివేదిపై నిందితులు దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ కేసులు కొట్టివేయబడ్డాయి.అన్నిదారులు మూసుకుపోవడంతో నిందితులు పంకజ్‌ను హత్య చేయాలని పథకం పన్నారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.చంద్ర సిన్హ్ జడేజా, హితేష్ సిన్హ్ చుడాసామా, దక్షేష్ షా, భూపత్ సిన్హ్ జడేజా, మాన్ సిన్ వాధేర్, ఘన్‌శ్యామ్ చుడాసమా, భరత్ భట్, భరత్ సిన్హ్ జడేజా, చంద్రకాంత్ డాకి, జసుభా జడేజాలకు కోర్టు జీవిత ఖైదు విదించింది.







