టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.ఈ హీరో గత సినిమా “క”( Ka Movie ) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడంతో పాటు ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చేసింది.కిరణ్ అబ్బవరం మరికొన్ని రోజుల్లో దిల్ రూబా సినిమాతో( Dilruba Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
దిల్ రూబా సినిమాపై ప్రేక్షకుల్లో ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.నా కోపం, ప్రేమల సమ్మేళనంగా తెరకెక్కిన సినిమా దిల్ రూబా అని కిరణ్ అబ్బవరం అన్నారు.
ఈ బైక్( Bike ) అంటే నాకు ఎంతో ఇష్టమని మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో కష్టపడి ఈ బైక్ తయారు చేశారని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.మార్కెట్ లో ఈ బైక్ ఎక్కడా దొరకదని ఈ బైక్ ను మీకు ఇచ్చేయాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.

నేను నిజంగానే ఈ బైక్ ఇవ్వాలని అనుకుంటున్నానని అందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదని కిరణ్ అబ్బవరం అభిప్రాయపడ్డారు.ఇప్పటివరకు దిల్ రూబా సినిమా నుంచి విడుదలైన పాటలు కావచ్చు టీజర్ కావచ్చు ఈవెంట్స్ లో మేము మాట్లాడిన మాటలు కావచ్చని దిల్ రూబా ఫ్లాట్ ఏంటో కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బైక్ ఇస్తానని తెలిపారు.

ఈ కాంటెస్ట్ లో గెలిచిన వాళ్లతో కలిసి దిల్ రూబా మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని ఆయన చెప్పుకొచ్చారు.క సక్సెస్ తో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ సైతం పెరిగింది.కిరణ్ అబ్బవరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.కిరణ్ అబ్బవరం రాబోయే రోజుల్లో క సినిమా సీక్వెల్ లో నటించనున్నారు.







