బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా నటించిన చిత్రం అఖండ.( Akhanda ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
అఖండ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రగ్యా జైష్వాల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఇందులో విలన్ గా నటించారు.

అఖండ పార్ట్ వన్ విడుదల అయ్యి మంచి సక్సెస్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ఇప్పుడు పార్ట్ 2 ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగకు విడుదల చేయాలని ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నారు.ఇప్పటికే ప్రకటనను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అఖండ 2( Akhanda 2 ) తో బాలకృష్ణ ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.అఖండ సినిమా నార్త్ ఆడియన్స్ కూడా ఇష్టపడ్డారు.అఖండ హిందీ డబ్బింగ్ కి మంచి వ్యూస్ వచ్చాయి.
అందుకే అఖండ 2 ని డైరెక్ట్ గా రిలీజ్ చేసేలా చూస్తున్నారు.అయితే అఖండ 2 తో బోయపాటి ప్లానింగ్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.
ముఖ్యంగా సినిమాలో బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్ వేరే లెవెల్ అని తెలుస్తోంది.అంతేకాదు అఖండ 2 లో పార్ట్ 3 కి సంబందించిన అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తారని తెలుస్తోంది.
ఆ అదిరిపోయే ట్విస్ట్ మరి ఏదో కాదండోయ్ అఖండ 2 సినిమా చివర్లో అఖండ 3( Akhanda 3 ) కి లీడ్ ఇస్తారట.
అఖండ 2 లో కథ వేరే మలుపు తీసుకోగా పార్ట్ 2 పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతతో ఉంటుందని అంటున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య అఘోరా రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.మొత్తానికి బోయపాటి అఖండ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారని అనిపిస్తోంది.
అఖండ 2 మాత్రమే కాదు అఖండ 3 కూడా ఉంటుందని పార్ట్ 2 లో మూడో భాగానికి సంబందించిన ట్విస్ట్ ఉంటుందని అది ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుందని చెప్పుకుంటున్నారు.మరి నిజంగానే అఖండ 2, సినిమాకు సీక్వెల్ ఉంటుందా, ఈ విషయం గురించి నిజా నిజాలు తెలియాలి అంటే దసరా వరకు వేచి చూడాల్సిందే మరి.