టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్( Samyuktha Menon ) ఒకరు.ఈ హీరోయిన్ మద్యం తాగడం( Alcohol ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన పేరు నుంచి మీనన్ ను తొలగించిన సంగతి తెలిసిందే.ఈ హీరోయిన్ మలయాళీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెబుతున్న ఈ బ్యూటీ కుంభమేళాకు( Kumbhmela ) వెళ్లి పవిత్ర స్నానం చేసి వచ్చారు.కేరళ స్టైల్ వంటకాలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ బ్యూటీ చెబుతున్నారు.
తను అప్పుడప్పుడూ ఆల్కహాల్ తీసుకుంటానని క్లోజ్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునే సమయంలో మాత్రమే తాను ఆల్కహాల్ తీసుకుంటానని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్ట్ లతో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారని సినిమాల్లో గ్లామరస్ గా చూపించినా బయట మాత్రం హుందాగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.తోటి ఆర్టిస్టులు బాగా నటిస్తే తాను కూడా బెస్ట్ గా నటిస్తానని అవతలి ఆర్టిస్ట్ సరిగ్గా నటించని పక్షంలో తాను కూడా సరిగ్గా చేయలేనని ఆమె వెల్లడించారు.ఫిక్షన్ నవలలు అన్నా మన దేశ సంస్కృతిని తెలియజేసే నవలలు అన్నా ఇష్టమని సంయుక్త మీనన్ పేర్కొన్నారు.

అఖండ సీక్వెల్ లో( Akhanda Sequel ) నటించే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.తాను రాబోయే రోజుల్లో చేయబోతున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.సంయుక్త మీనన్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.త్వరలో సంయుక్త మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.







