ఉన్నత విద్య కోసం భారతీయులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో భారతీయ యువత చదువుకుంటున్నారు.
మన కుర్రాళ్ల వల్ల ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు భారీగా మేలు కలుగుతోంది.భారతీయులు అత్యధికంగా వెళ్లే దేశాల్లో కెనడా ముందు వరుసలో ఉంటుంది.
మెరుగైన జీవన విధానం, సులభమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, టాప్ క్లాస్ విద్యాసంస్థలు, పైగా పెద్ద ఎత్తున భారతీయ కమ్యూనిటీ స్థిరపడిన దేశం కావడంతో కెనడాకు( Canada ) భారతీయులు ఎక్కువగా వెళ్తున్నారు.
అయితే ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
ప్రధాని జస్టిన్ ట్రూడో( PM Justin Trudeau ) భారత్‌తో చీటికీ మాటికీ కయ్యానికి కాలు దువ్వుతూ ఉండటం, ఖలిస్తానీయుల ఆగడాలు పెరుగుతుండటంతో భారతీయ యువత కెనడా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు.దీనికి తోడు కెనడా ప్రభుత్వం కూడా వలసలను , అంతర్జాతీయ విద్యార్ధుల రాకను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.

‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్‌డీఎస్)ని( Student Direct Stream ) నవంబర్ 8 నుంచి నిలిపివేస్తున్నట్లు ట్రూడో ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.ఈ చర్య వేలాది మంది అంతర్జాతీయ విద్యార్ధులపై( International Students ) ముఖ్యంగా భారతీయ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.2018లో ప్రారంభించబడిన ఎస్‌డీఎస్.నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ సహా 14 దేశాలకు చెందిన దరఖాస్తుదారుల కోసం స్టడీ పర్మిట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది.

ఈ కార్యక్రమం కింద విద్యార్ధి వీసాల అనుమతి , జారీ, ఆమోదం వంటి ప్రక్రియలు వేగంగా జరుగుతాయి.కెనడియన్ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు సహా అన్ని స్థాయిలలో విద్యార్ధి వీసాలను( Student Visa ) 2025 నాటికి 4,37,000కు పరిమితం చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే స్టడీ పర్మిట్‌లపై రెండేళ్ల పరిమితి సహా ఈ సంఖ్యను 35 శాతం మేర తగ్గించింది.ఉన్నపళంగా పర్మిట్‌ల రద్దు, వీసా దరఖాస్తుల పరిశీలనను పెంచడం, ఎగ్జిట్ రూల్స్‌ను కఠినతరం చేయడంతో కెనడాలోని వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ పరిణామాలతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.







