సినిమాలు చేయటం కంటే ఐఏఎస్ అవ్వడమే ఈజీ... సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) పరిచయం అవసరం లేని పేరు.ఈయన ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్నారు.

 Director Sandeep Reddy Gives Mass Counter To Ias Vikas Divyakirti Details,sandee-TeluguStop.com

సందీప్ రెడ్డి చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే పాపులర్ అయ్యారు అనంతరం ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కించి అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఇక ఇటీవల యానిమల్ ( Animal Movie ) సినిమాతో మరో హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇలా సందీప్ రెడ్డి తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఇక తన గురించి ఎవరైనా విమర్శిస్తే సందీప్ రెడ్డి పెద్దగా పట్టించుకోరేమో కానీ తన సినిమాల గురించి ఎవరైనా విమర్శిస్తే అవతల ఉన్నది ఎలాంటి వ్యక్తులైన వారికి తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉంటారు.

అయితే ఇటీవల యానిమల్ సినిమా గురించి ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ దివ్య కీర్తి ( IAS Vikas Divyakirti ) తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.యానిమల్ లాంటి సినిమాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి.

ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు.

Telugu Animal, Iasvikas, Sandeep Reddy, Sandeepreddy-Movie

మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు.దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు.కానీ కేవలం డబ్బు కోణంలోనే మాత్రమే సినిమాలను చూడకూడదని సామాజిక విలువలను కూడా చాటి చెప్పేలా సినిమాలు ఉండాలి అంటూ మాట్లాడారు.

తాజాగా కలెక్టర్ చేసిన ఈ విమర్శలపై సందీప్ రెడ్డి స్పందించారు.  ఓ ఐఏఎస్‌ అధికారి యానిమల్‌ వంటి చిత్రాలు రాకూడదన్నారు.ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది.యానిమల్ సినిమా సమాజాన్ని ఒక పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని మాట్లాడుతున్నారు.

Telugu Animal, Iasvikas, Sandeep Reddy, Sandeepreddy-Movie

ఇలా అనవసరంగా ఎవరైనా నా సినిమాలపై దాడి చేస్తూ మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది నేను చూస్తూ ఊరుకోనని తెలిపారు.అసలు ఒక సినిమా చేయాలి అంటే ఎంత కష్టమో మీకు తెలుసా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంటే ఢిల్లీలో ఓ మూడు సంవత్సరాలు పాటు కోచింగ్ సెంటర్ కి వెళ్లి ఓ 1500 పుస్తకాలు చదివితే మూడేళ్లలో ఐఏఎస్ కావచ్చు కానీ ఐఏఎస్ అయినంత ఈజీగా సినిమాలు చేయలేము అంటూ తెలిపారు.సినిమాలు చేయడానికి కథ రాయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు ఉండవు అంటూ తనదైన శైలిలోనే సందీప్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube