సంక్రాంతికి వస్తున్నాం మూవీ 50 రోజుల లెక్క ఇదే.. చిన్న సినిమా పెద్ద రికార్డ్ సాధించిందిగా!

ఈ ఏడాది కలెక్షన్ల పరంగా ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి అసలైన పండగ సినిమాగా నిలిచింది.

 Sankranthiki Vasthunnam Movie 50 Days Centres Details, Sankranthiki Vasthunnam,-TeluguStop.com

మార్చి 4వ తేదీకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై 50 రోజులు అవుతుంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ 40కు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడిందని సమాచారం.

ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద రికార్డ్ క్రియేట్ చేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఈ సినిమా ఓటీటీలో( OTT ) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

బుల్లితెరపై ప్రసారమైన సమయంలోనే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.జీ తెలుగు( Zee Telugu ) ఛానల్ చేసిన ఈ ప్రయోగం సఫలమైందని తెలుస్తోంది.

Telugu Anil Ravipudi, Venkatesh-Movie

మరోవైపు ఓటీటీ వెర్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిడివి తగ్గిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కొంతమేర నిజం ఉంటే కొంతమేర అబద్ధం ఉంది.ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన వెర్షన్ 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కాకుండా 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ గా ఉండటంతో నిడివి తగ్గిందని తెలుస్తోంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుల్లితెరపై రేటింగ్స్ విషయంలో అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Venkatesh-Movie

విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంటి సినిమాలలో నటిస్తే మరిన్ని విజయాలు ఖాతాలో చేరడం పక్కా అని చెప్పవచ్చు.విక్టరీ వెంకటేశ్ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.విక్టరీ వెంకటేశ్ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

విక్టరీ వెంకటేశ్ తర్వాత సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube