చాలా మంది హీరోలు తమ యాక్టింగ్, మేనరిజం, వాకింగ్ స్టైల్ ఇతర టాలెంట్ తో ఆకట్టుకుంటారు కానీ కొందరు మాత్రం కేవలం వాయిస్ తోనే కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.వీరి వాయిస్ చాలా యూనిక్‌గా ఉంటుంది.
అదే సమయంలో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అంత గొప్పగా ఉంటుంది.ఆ వాయిస్ వినడానికే కొంతమంది సినిమాలు చూస్తారంటే అతిశయోక్తి కాదు.అలాంటి ప్రత్యేకమైన గొంతు ఉన్న హీరోలు ఎవరో తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని

హీరో నాని( Nani ) ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగలడు.ఇప్పటివరకు ఆయన యాక్టింగ్ కి వంక పెట్టిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.అయితే ఈ హీరో యాక్టింగ్ కంటే వాయిస్ ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఎమోషనల్ డైలాగ్స్ చెప్పినా, రొమాంటిక్ డైలాగ్ చెప్పినా కూడా ఇంకా వినాలనిపిస్తుంది.ముఖ్యంగా అమ్మాయిలైతే నాని గొంతు వింటే ఫిదా అయిపోతారు.
అతని మాస్ యాక్షన్ డైలాగులకు విజిల్స్ కూడా వేస్తారు.అంతటి మ్యాజిక్ నాని వాయిస్ లో ఉంది.
నవీన్ చంద్ర

కన్నడ యాక్టర్ నవీన్ చంద్ర(Naveen Chandra ) తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలడు.ఈ నటుడు అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మూవీలో అతను చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి.నవీన్ చంద్ర వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది.అతను రఫ్ గా చెప్పే డైలాగ్‌లు కూడా వినడానికి చాలా స్వీట్‌గా అనిపిస్తాయి.అదే అతని వాయిస్‌లో ఉన్న మ్యాజిక్.
దగ్గుబాటి రానా
రానా హల్క్ లాంటి బాడీకి తగ్గట్టు ఆ దేవుడు భయంకరమైన వాయిస్ కూడా ఇచ్చాడు.నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా ఒక వార్నింగ్ ఇస్తాడు.
ఆ వాయిస్ వేరే లెవల్ ఉంటుందని చెప్పుకోవచ్చు.బయట మాట్లాడినా కూడా రానా వాయిస్ చాలా బెస్తో గంభీరంగా అనిపిస్తుంది.
మహేష్ బాబు

మహేష్ బాబు వాయిస్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది.ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటూ మహేష్ బాబు చెప్పిన మాస్ డైలాగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది.మహేష్ బాబు వాయిస్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టే డబ్బింగ్ ఆర్టిస్టులు అతని వాయిస్ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) వాయిస్ ఎంత బాగుంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.
ఈ హీరో గొంతు అంటే కూడా అమ్మాయిలు పడి చచ్చిపోతారు.