వెల్లుల్లి.ఆరోగ్యానికి ఇది చేసే మేలు గురించి, అందించే ప్రయోజనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
అందుకే వెల్లుల్లిని రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ముఖంపై ఉండే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను తొలగించి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను అందించడంలో వెల్లుల్లి గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ చర్మానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు పచ్చి పాలు, అర కప్పు వాటర్ పోసుకుని నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత అందులో పొట్టు తొలగించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకుని చిన్న మంటపై పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకున్న వెల్లుల్లిని చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్‌గా కూల్ అయ్యాక మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలను పాలతో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో నెమ్మదిగా కళ్ళల్లోకి వెళ్లకుండా ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.ఈ పవర్ పుల్ హోమ్ రెమెడీని తరచూ ట్రై చేస్తుంటే.మొటిమలు, మచ్చలు పోయి ముఖం క్లియర్‌గా మరియు గ్లోయింగ్‌గా మారుతుంది.