తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చాలామంది పరభాష హీరోలు కన్నేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీ నుంచి విక్రమ్, సూర్య( Vikram, Surya ) లాంటి స్టార్ హీరోలు తెలుగులో కూడా భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పటికే వాళ్ళు చేసిన సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్నారు.ఇక చాలా రోజుల నుంచి తెలుగు మార్కెట్ మీద కన్నేసిన ధనుష్ మాత్రం ఇక్కడ భారీ సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు.
కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన చేసే ప్రతి సినిమా కూడా తెలుగులో సగటు ప్రేక్షకుడిని అలరించడంలో చాలా వరకు విఫలమవుతుంది.ఇక రఘువరన్ బీటెక్ , సార్ ( Sir movie )రెండు సినిమాలతో తప్ప ఆయన ఇంతవరకు ఏ సినిమాతో కూడా ఇక్కడ సక్సెస్ ని సాధించలేదు.
![Telugu Dhanush, Kollywood, Raayan, Sekhar Kammula, Sir, Surya, Vikram-Movie Telugu Dhanush, Kollywood, Raayan, Sekhar Kammula, Sir, Surya, Vikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/09/Vikram-Surya-dhanush-Raayan.jpg)
ఇక రీసెంట్ గా వచ్చిన ‘ రాయన్ ‘ సినిమా( Raayan ) కూడా అనుకున్న మేరకు సక్సెస్ సాధించలేకపోయింది.ఇదే క్రమంలో ఆయన తెలుగు డైరెక్టర్లతో సినిమాలను చేయాలని ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ తో తెలుగులో స్ట్రైయిట్ సినిమా చేస్తున్న ఆయన తన తర్వాత సినిమాను కూడా మరొక తెలుగు దర్శకుడి తో చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Dhanush, Kollywood, Raayan, Sekhar Kammula, Sir, Surya, Vikram-Movie Telugu Dhanush, Kollywood, Raayan, Sekhar Kammula, Sir, Surya, Vikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/09/Vikram-Surya-dhanush-Raayan-kollywood.jpg)
మరి ధనుష్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన కన్నెయ్యడానికి గల కారణం ఏంటి అంటే తెలుగులో ఆయన మార్కెట్ పెరిగితే ఆయనకు విపరీతమైన క్రేజ్ అయితే వస్తుంది.ఇక సూర్య విక్రమ్ లకు ఇక్కడ భారీ క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.అందుకే వాళ్ళ సినిమాలు తమిళం లో సరిగ్గా ఆడకపోయిన తెలుగులో మాత్రం మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి.అందుకే ధనుష్ కూడా అదే రీతిలో తన సినిమాలతో తన స్టార్ డమ్ ను అందుకోవాలని చూస్తున్నాడు…
.