ఇటీవల రోజుల్లో దాదాపు అందరూ ఏదో ఒక జుట్టు సంబంధిత సమస్యతో బాధ పడుతూనే ఉన్నారు.జుట్టు రాలడం, చిట్లడం, పొట్లి పోవడం, విరిగి పోవడం, చుండ్రు ఇలా రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
వీటికి దూరంగా ఉండాలీ అనుకుంటే జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మార్చుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ హెయిర్ మాస్క్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా కొన్ని మందారం పువ్వులను తీసుకుని నీడలో బాగా ఎండ బెట్టి పొడి చేసి స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మందారం పువ్వుల పొడి, నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగిన నీరు, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ మాస్క్ సిద్ధమైనట్టే.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు లేదా మూడు గంటల అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయాలి.
ఇలా వారంలో ఒక్క సారి చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అంది దృఢంగా, ఆరోగ్య వంతంగా మారతాయి.
ఫలితంగా హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్, ఆయిలీ హెయిర్ వంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.మరియు కేశాలు ఎల్లప్పుడూ షైనీగా మెరుస్తాయి.కాబట్టి, పైన చెప్పిన హెయిర్ మాస్క్‌ను ఖచ్చితంగా ట్రై చేసి జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకోండి.