1.తిరుమల సమాచారం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 300 ప్రత్యేక దర్శన టికెట్లు కోటాను ను ఈరోజు టీటీడీ విడుదల చేయనుంది.
2.నేడు కారుమంచికి జగన్
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.కొండేపి వైసిపి ఇన్చార్జి వరి కోటి అశోక్ బాబు తల్లి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు టంగుటూరు నుంచి కారుమంచి వెళ్ళనున్నారు.
3.కవిత పిటిషన్ పై నేడు సుప్రీం లో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు దీనిపై సుప్రీం విచారణ చేయనుంది.
4. కరోనా అలెర్ట్
దేశం లో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్అయ్యింది దీనిపై అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
5.కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు

నేడు రేపు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేయనుంది.రాహుల్ గాంధీ పై అనర్హత వేటు కు నిరసనగా ఈ దీక్షలు చేపట్టనున్నారు.
6.నేడు గవర్నర్ ను కలవనున్న జగన్
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.
7.నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
8.హరీష్ రావు పర్యటన
నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
9.అన్నవరం దేవస్థానం

ఈరోజు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డైలీ ఈవో కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు జరగనుంది.
10.ధర్మకర్తల మండలి సమావేశం
నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది.దేవస్థానం బడ్జెట్ ఏప్రిల్ 30 నుంచి జరగనున్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లపై చర్చించనున్నారు.
11.రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
12.బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క విమర్శలు
రాష్ట్ర సంపదను టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని పిసిసి ఉపాధ్యక్షుడు భట్టి విక్రమార్క విమర్శించారు.
13.మహారాష్ట్రలోను పోటీ చేస్తాం : కేసీఆర్

మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లోను బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
14.ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మిథున్ రెడ్డి కామెంట్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలను అన్ని ఆధారాలతోనే సస్పెండ్ చేశామని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు.
15.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.ఈరోజు శ్రీవారి దర్శనానికి భక్తులు ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న తిరుమల శ్రీ వారిని 79,415 మంది భక్తులు దర్శించుకున్నారు.
16.నేడు రేపు వర్షాలు
నేడు రేపు ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని, కోస్తా లోని పలుచోట్ల ఉరుములు పిడుగులతో, రాయలసీమలో చెదురు మధురగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
17.త్వరలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్, శాఖ పురుషుడు అనే ప్రత్యేక సంచిక తీసుకురాబోతున్నట్లు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి డి జనార్ధన్ తెలిపారు.
18.రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కు కొత్త అధ్యక్షుడు
ఏపీ రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రిటైర్డ్ డిజిపి మాలకొండయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
19.రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కు ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు.గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59, 730