1.టెన్త్ పరీక్షలు నిర్వహణపై కీలక నిర్ణయం
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశించింది.
2.లాలూ నివాసంలో సిబిఐ సోదాలు
ఐ ఆర్ సి టి సి కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి అధికారిక నివాసంలో సిబిఐ సోమవారం సోదాలు జరిపింది.
3.విశాఖ గ్లోబల్ సమ్మిట్ పై లోకేష్ కామెంట్స్
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.
4.సిబిఐ విచారణ పై అవినాష్ రెడ్డి కామెంట్స్
సిబిఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు తాను చెబుతానని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
5.జగన్ పై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం
చింతలపూడి ఎస్సీ గురుకుల పాఠశాల లో విద్యార్థుల అవస్థలపై సీఎం జగన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.చింతలపూడి ఎస్సి గురుకుల పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఒకే గోడౌన్ లో మగ్గుతున్నారని, కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాల భవన నిర్మాణం నిలిచిపోయిందని రామకృష్ణ లేఖలో పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
6.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటికి 36వ రోజుకు చేరుకుంది.
7.జగ్గారెడ్డి కామెంట్స్
తెలంగాణలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 1996 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని , సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.
8.హాస్టల్లో విలీనం చేయవద్దు : ఎస్ఎఫ్ఐ
50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న సంక్షేమ వసతి గృహాలను దగ్గరలోని వసతి గృహాల్లో విలీనం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
9.మంత్రి కేటీఆర్ కామెంట్స్
ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి కేటీఆర్ అన్నారు.
10.కొండగట్టు పై రేవంత్ రెడ్డి కామెంట్స్
కొండగట్టుకు తక్షణం 500 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
11.బాలుడు మృతి పై జిహెచ్ఎంసి పై కిషన్ రెడ్డి ఆగ్రహం
కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్ కేంద్రాలను హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.అంబర్ పేట లో ఉన్న కుక్కలను బయటకు తరలించాలని , కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ వ్యవహారంలో జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యమే బాలుడు మృతికి కారణమని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
12.కెసిఆర్ కు జగ్గారెడ్డి లేక
వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.
13.ఏపీ ఉద్యోగుల ఉద్యమం
ఈనెల 8 నుంచి ఏపీ ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించనున్నారు.ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
14.సిబిఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి
ఈ రోజు సీబీఐ విచారణ కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాలేదు.
15.ప్రధానిపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సాధువు లాంటివారని , అటువంటి వ్యక్తిని జైల్లో పెడతారా అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
16.నాదెండ్ల మనోహర్ కామెంట్స్
ఇప్పటం లో జనసేన సభకు స్థలం ఇచ్చారని, ఆ గ్రామం పై కక్ష కడతారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
17.హైదరాబాదులో నీటి సరఫరా బంద్
హైదరాబాద్ లో రెండు రోజులపాటు నీటి సరఫరా బంద్ కానుంది .గోదావరి పైప్ లైన్ మరమ్మత్తులు కారణంగా నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
18.ప్రధానిపై రాహుల్ కామెంట్స్
భారత్ గురించి ప్రపంచమంతా కీర్తిస్తుంటే రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు అంటూ బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీ అన్నీ గుర్తున్నాయి అంటూ ఆయన కామెంట్ చేశారు.
19.కందులపై దిగుమతి సుంకం ఎత్తివేత
కందులపై ప్రస్తుతం ఉన్న పది శాతం మూల దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,550
.