ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర.( Devara ) ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 27 న విడుదల కానున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్( NTR ) నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
దానికి తోడు ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను కాస్త మరింత పెంచాయి.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో కూడా దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు.
మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో దేవర చేరడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.ఆపై ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే టాప్ 5 జాబితాలో ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని దేవర ఎంత వరకు అందుకుంటుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హైలైట్ అంశాల( Devara Highlight Scenes ) గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ప్రచారం జరుగుతోంది.దేవర చిత్రంలో కుస్తీ ఫైట్, అండర్ వాటర్ సీన్ హైలైట్ గా ఉంటాయట.అలాగే హాఫ్ మూన్ సముద్రం ఫైట్ సీన్ విజువల్ గా గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందని టాక్.ఆయుధ పూజ సాంగ్, ఎన్టీఆర్ మరో క్యారెక్టర్ లుక్, చుట్టమల్లే, ఫియర్ సాంగ్స్ వైబ్ మూవీకి రిచ్ లుక్ తీసుకొచ్చి ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.
అలా మొత్తంగా చూస్తే ఈ సినిమా చూసినంత సేపు చాలా అంశాలు ప్రేక్షకులని ముగ్ధుల్ని చేస్తాయని భావిస్తున్నారు.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను రాబడుతుందో చూడాలి మరి.