యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన దేవర సినిమా( Devara Movie ) నుంచి తాజాగా మరో ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ న భూతో న భవిష్యత్ అనేలా ఉందని కమర్షియల్ అంశాలతో ఉన్న ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కమర్షియల్ అంశాలతో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందిగా అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
దేవర సినిమా ఫస్ట్ ట్రైలర్ తో పోలిస్తే సెకండ్ ట్రైలర్ మరింత బెటర్ గా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.దేవర,( Devara ) వర( Vara ) రెండు పాత్రలకు ట్రైలర్ లో బాగానే ప్రాధాన్యత ఉంది.
దేవర, వర పాత్రల మధ్య షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నారనే అభిప్రాయాన్ని కలిగించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

దేవర సినిమా థియేట్రికల్ హక్కులను మరీ ఎక్కువ మొత్తానికి అమ్మడం లేదని తెలుస్తోంది.దేవర వర్సెస్ వర సీన్స్ ఉండబోతున్నాయా అనే చర్చ సైతం మొదలైంది.సినిమా రిలీజ్ తర్వాత మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికే ఛాన్స్ ఉంది.కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం దేవర నచ్చడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర1 సినిమా కమర్షియల్ ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.దేవరపై కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా సినిమా మాత్రం బెస్ట్ ఔట్ పుట్ తో తెరకెక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎర్లీ మార్నింగ్ షోస్ ప్రదర్శితం కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుంది.దేవర రిలీజ్ ట్రైలర్( Devara Release Trailer ) వ్యూస్ పరంగా కూడా అదరగొడుతుండటం గమనార్హం.
ఇండస్ట్రీ షేక్ అయ్యే కథతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.