ప్రస్తుతం ప్రధాని మోదీ( Narendra Modi ) అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ టూర్ లో భాగంగా క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస నిర్వహించే మరో సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్‌తో, ఇతర దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన డెలావర్‌లోని విల్మింగ్టన్‌కు మోడీ వెళ్లారు.అక్కడ ప్రధాని మోదీ బైడెన్‌తో భేటీ అవ్వడంతో పాటు.
బైడెన్‌కు ఒక పురాతనమైన వెండి రైలు మోడల్ బహుమతిగా ఇచ్చారు.ఇది వాస్తవానికి హ్యాండ్ మేడ్ రైలు, పాతకాలపు మోడల్ లో ఉన్న ఈ వెండి రైలును మహారాష్ట్రకు చెందిన కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇందుకోసం వెండి హస్తకళలో గొప్ప ప్రసిద్ధి చెందిన హస్త కళాకారులతో 92.5 శాతం వెండితో తయారు చేయించినట్లు సమాచారం.
అలాగే ఈ మోడల్ భారతీయ లోహ కళాత్మకకు చిహ్నంగా, చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, క్లిష్టమైన ఫిలిగ్రీ వంటి సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేయించారు.అలాగే ఈ రైలు ప్రధాన క్యారేజ్ వైపు ఢిల్లీ – డెలావేర్( Delhi – Delaware ), ఇంజిన్ వైపు ఇండియన్ రైల్వేస్ అని ఇంగ్లీషు, హిందీ లిపిలో దీనిపై రాసి ఉండడం విశేషం.దీనితో ఈ అరుదైన కళాఖండం కళాకారుల అసాధారణ నైపుణ్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఇండియన్ రైల్వే సుదీర్ఘ చరిత్రను కూడా అద్దం పడుతున్నట్టు ఉంది.ఇది ఇలా ఉండగా.
మరొక వైపు అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బిడెన్‌కు కూడా మోదీ మరో అరుదైన బహుమతిని ఇచ్చారు.అది ఏమిటంటే.
పేపియర్ మాచే బాక్స్‌లో పష్మినా శాలువాలను ఇచ్చారు.ఇది నాణ్యత కలిగిన పష్మీనా శాలువాను జమ్మూకాశ్మీర్‌లో తయారు చేయించినట్టు సమాచారం.
వాస్తవినికి ఆ ప్రాంతానికి చెందిన శాలువాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ తో పాటు మంచి పేరు కూడా ఉంది.ఈ శాలువాలకు లడఖ్ లోని చాంగ్తాంగి ప్రాంతం నుంచి ప్రస్థానం ప్రారంభం అయింది.
ఇక ఈ శాలువాలను ఏకంగా మృదువైన ఫైబర్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన నూలుతో తయారు చేస్తారు.ఈ నూలు తయారీ పద్ధతి కూడా భిన్నమైనది.
ప్రత్యేక నైపుణ్యం కలిగిన కళాకారులు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి చేతితో మాత్రమే నూలుగా మారుస్తారట.</br
ఇంకా వివిధ మొక్కలు, ఖనిజాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే పష్మీనా శాలువాల తయారీలో వాడుతారు.అందుకే పష్మీనా శాలువాలను మన దేశ వారసత్వ వస్తువులుగా పరిగణిస్తారు.అంతేకాకుండా పూర్వికుల జ్ఞాపకాలను, భావోద్వేగాలను వీటి దారాలలో నిక్షిప్తమై ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఇలా తయారు చేసిన షష్మినా శాలువాలు సాంప్రదాయక పద్ధతుల్లోనే ప్యాకింగ్ కూడా ఉంటుంది.అలాగే జమ్ముకశ్మీర్ నుంచి పేపియర్ మాచే బాక్స్ లలో ప్యాక్ చేయడం విశేషం.
ఈ శాలువాల సున్నితత్వం, నాణ్యత పాడవకుండా మాచె బాక్స్‌లు కాపాడుతాయి.ఈ బాక్స్ లను కాగితం గుజ్జు, జిగురు, ఇతర సహజ పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగించి చేతితో తయారు చేస్తారు.
అయితే, ఈ బాక్సులను కేవలం ఫంక్షనల్‌గా మాత్రమే కాకుండా అలంకరణ వస్తువులుగా కూడా ఉపయోగిస్తారట.