పగిలి నొప్పి పుడుతున్న పెదాలను ఒక్క నైట్ లో రిపేర్ చేసే హోమ్ మేడ్ లిప్ బామ్ మీకోసం!

పెదాల పగుళ్లు( Cracked Lips ). సహజంగా వింటర్ సీజన్ లోనే ఈ సమస్యను అధికంగా ఫేస్ చేస్తుంటారు.

 Homemade Lip Balm For Cracked Lips-TeluguStop.com

కానీ కొందరికి సీజన్ తో పని లేకుండా పెదాలు త‌ర‌చూ పగిలిపోతూనే ఉంటాయి.ప‌గుళ్ల కార‌ణంగా తీవ్రమైన నొప్పి క‌లుగుతుంటుంది.

పేదల పగుళ్లను నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.

అయితే పగిలి నొప్పి పుడుతున్న పెదాలను ఒక్క నైట్ లో రిపేర్ చేసే హోమ్ మేడ్ లిప్ బామ్ ఒకటి ఉంది.ఈ లిప్ బామ్ ను వాడితే పెదాల పగుళ్లు మాయం అవ్వడమే కాదు మరిన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లిప్ బామ్( Lip Balm ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Cracked Lips, Latest, Lip Balm, Lip Care-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ), నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.అలాగే అర కప్పు బీస్ వాక్స్ వేయాలి.ఇప్పుడు ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో ఉంచి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్ లో పూర్తిగా మెల్ట్ చేయాలి.
ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, పావు టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్( Beetroot Powder ), చిటికెడు రోజ్ పెటల్స్ పౌడర్, ఐదు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దీనిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

గంట లేదా రెండు గంటలకు మన లిప్ బామ్ సిద్ధం అవుతుంది.ఈ న్యాచురల్ లిప్ బామ్ ను ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు పెదాలకు అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Cracked Lips, Latest, Lip Balm, Lip Care-Telugu Health

రోజుకు రెండు మూడు సార్లు ఈ లిప్ బామ్ ను వాడితే పెదాల పగుళ్లు మాయం అవుతాయి.లిప్స్ మృదువుగా, కోమలంగా( Soft and Pink Lips ) మారతాయి.అంతేకాదు ఈ లిప్ బామ్ ను రెగ్యులర్ గా వాడితే మీ పెదాల నలుపు వదిలిపోతుంది.లిప్స్ గులాబీ రంగులోకి మారతాయి.అందంగా ఆకర్షణీయంగా మెరుస్తాయి.కాబట్టి పగిలి నొప్పి పుడుతున్న పెదాలను ఈ న్యాచురల్ లిప్ బామ్ తో నివారించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube