రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లం పిటిషన్ ను విచారణకు తెలంగాణ హైకోర్టు స్వీకరించింది.ఈ క్రమంలోనే రిజిస్ట్రీ అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది.
పిటిషన్ కు మెయిన్ నంబర్ ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.కాగా కోర్టు రికార్డులో ఉన్న సీబీఐ ఛార్జిషీట్ లో స్టేట్మెంట్ ను తొలగించాలని అజయ్ కల్లం పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలాన్ని సీబీఐ మార్చి ఇచ్చిందని అజయ్ కల్లం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీబీఐ ఛార్జిషీట్ లో ఉన్న వాంగ్మూలాన్ని తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.