పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆహారం, తినగలిగే ఆహారంలో మొక్కజొన్న కూడా ఒకటి.ముఖ్యంగా వర్షం పడుతున్న సమయంలో వేడి వేడిగా మొక్కజొన్న తింటే ఆ మాజానే వేరు.
కాల్చుకుని కాని, ఉడకపెట్టుకుని కాని.ఇలా ఎలా తిన్నా మొక్కజొన్న టేస్టీగా ఉంటాయి.
ఇక ఈ సీజన్‌లో విరివిరిగా లభించే మొక్కజొన్న రుచిలోనే కాదు.ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంలోనూ అమోఘం అని చెప్పాలి.
మరి మొక్కజొన్న ఏ విధంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది? అన్నది తెలుసుకోండి.మొక్కజొన్నలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది.
జీర్ణసమస్యలతో బాధపడేవారు మొక్కజొన్న తింటే చాలా మంచిది.రక్తహీనత సమస్య ఉన్నవారు మొక్కజొన్న తింటే.
ఇందులో ఉండే విటమిన్ బి12 మరియు ఐరన్ రక్తాన్ని పెంపొందిస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ, గుండె జబ్బులను నివారించే మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ ఫరస్ కూడా మెక్కజొన్నలో ఉంటాయి.మధుమేహంతో బాధపడేవారు కూడా మొక్కజొన్న తినొచ్చు.తద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
అలాగే మొక్కజొన్న తినడం వల్ల క్యాన్సర్ వంటి భయంకర సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.
ఎందుకంటే, మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.
శరీరంలో అదనపు కొవ్వును కరిగించడంలోనూ మొక్కజొన్న అద్భుతంగా పనిచేస్తుంది.అందుకే ఎన్నో పోషకాలు ఉన్న మొక్కజొన్నను డైట్‌లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.