ప్రస్తుత రోజులలో చిన్నపిల్లవాడి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరికొందరు.వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియానే ప్లాట్ ఫామ్ గా మార్చుకొని ఫేమస్ అవుతూ ఉంటారు.
మరికొందరు అయితే, రోడ్లపై, రైల్వే ప్లాట్ ఫామ్ లో పై వివిధ రకాల విచిత్ర విన్యాసాలు చేసి చివరకు ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ వారితో పాటు పక్కవారిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటారు.అచ్చం అలాగే తాజాగా ఒక వ్యక్తి రైలు పట్టాలపై( Train Tracks ) ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.రైలు పట్టాలపై ఒక యువకుడు పడుకొని విచిత్రమైన విన్యాసం చేశాడు.రెండు పట్టాల మధ్య నిలబడి అతడు వెంటనే పట్టాల మధ్య పడుకున్నాడు.కాసేపటికి ఒక రైలు( Train ) వేగంగా అతని మీదకు వెళ్ళిపోయింది.అయినా కానీ ఆ యువకుడు ఎటువంటి భయం లేకుండా కదలకుండా అలాగే పడుకొని ఉండిపోయాడు.రైలు పూర్తిగా ఆ యువకుడు పై దాటి వెళ్లిన అనంతరం పైకి లేచి నిలబడి ఏదో గొప్ప పని సాధించాన్నట్టు సంతోషంతో ఎగిరి గంతేశాడు.
రైలు వచ్చే క్రమంలో ఇలా పట్టాలపై పడుకొని విచిత్ర విన్యాసం చేసే క్రమంలో ఏ మాత్రం తేడా జరిగిన కానీ ప్రాణాలు గాల్లోకి పోయేవి.ఏదో అదృష్టం బాగుంది కాబ్బటి అతనికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
అయితే, ఇటీవల కాలంలో ఎక్కువగా రైలు పట్టాలపై వివిధ రకాల ప్రమాదకర విన్యాసాలు చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.కొంతమంది రైలు పట్టాల పక్కన నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చివరకు ప్రాణాల సైతం కూడా పోగొట్టుకున్న వారిని మనం చాలానే చూసాం.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.“ఇలాంటి బుద్ధిలేని వారిని కచ్చితంగా శిక్షించాలి” అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు “ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదకరం” అని కామెంట్ చేస్తున్నారు.