తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో( Amritsar ) జరిగిన కాల్పులు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తున్నాయి.అమృత్‌సర్‌లోని ప్రసిద్ధి గాంచిన స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్( Shiromani Akali Dal ) పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పై( Sukhbir Singh Badal ) ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
అతను సేవాదారుగా శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం( Golden Temple ) ప్రవేశ ద్వారం వద్ద సుఖ్‌బీర్ సింగ్ చక్రాల కుర్చీ పై కూర్చుని కాపలాదారుడుగా ఉండగా.
ఒక వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు.
అలా వచ్చిన ఆయన కొన్ని అడుగుల దూరంలో ఉన్న అతడు ప్యాంటు జేబులో నుంచి తుపాకి తీసి సుఖ్‌బీర్ సింగ్ పై కాల్పులకు పాల్పడ్డాడు.ఇది గమనించిన అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుని అడ్డుకొని పక్కకు తీసుకొని వెళ్ళగా సుఖ్‌బీర్ సింగ్ కు పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.వెంటనే అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతనిని పట్టుకొని పోలీసుల వద్దకు చేర్చారు.
ఆ సమయంలో మీడియా కూడా అక్కడ ఉంది.
అదృష్టవశాత్తు ఈ సంఘటనలో సుఖ్‌బీర్ సింగ్ కు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.ఇకపోతే నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించగా.అతడు గతంలో కూడా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పని చేసినట్లు సమాచారం.
శిరోమణి అకాలీదళ్ పార్టీఅధికారంలో ఉన్న సమయంలో అనేక తప్పిదాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి.ప్రస్తుతం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పై జరిగిన కాల్పులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.