అనసూయ( Anasuya ) సంచలనాలకు మారుపేరు అని చెప్పాలి.బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇక అనసూయ పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో కూడా భాగమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఈమె సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ చిత్ర బృందంతో ఎంతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.ఇక ఈ సినిమా గురించి కూడా ఈమె ఎంతో అద్భుతంగా వేదికపై మాట్లాడారు.
ఇలా అంతా బాగానే ఉంది కానీ ఈ వేడుక అయిపోయిన వెంటనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చలకు కారణమైంది.ఈమె సోషల్ మీడియా వేదికగా దూరపు కొండలు నునుపు అని ఒక చిన్న కొటేషన్ షేర్ చేశారు.అయితే ఈ కొటేషన్ లో కొండలు అనే పదాన్ని మాత్రమే అభిమానులు గుర్తిస్తూ ఈమె మరోసారి విజయ్ దేవరకొండను( Vijay Devarakonda ) ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ అనసూయ మధ్య వివాదం జరుగుతూనే ఉంది.ఇలా పరోక్షంగా ఈమె విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మరోసారి విజయ్ దేవరకొండను ఉద్దేశించే పోస్ట్ చేశారని అందరూ భావిస్తున్నారు.
బహుశా రష్మిక( Rashmika ) విజయ్ దేవరకొండ ప్రేమలో ఉండడంతో దూరపు కొండలు చాలా నునుపు అనే విధంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమెకు విజయ్ దేవరకొండ ఎలా నచ్చారన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.మరి అనసూయ ఈ పోస్ట్ ఎందుకు చేశారనే విషయంపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎన్నో చర్చలకు కారణమైంది.