అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మరి కొన్ని గంటలలో విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో అద్భుతంగా ఎదురు చూడటమే కాకుండా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లను ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఈ సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తే సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.ఇప్పటివరకు మెగా కాంపౌండ్ నుంచి ఒక్కరు కూడా పుష్ప సినిమాకు మద్దతుగా పోస్టులు చేయలేదు.
ఇలా మెగా ఫ్యామిలీ మౌనంగా ఉండడంతో ఎన్నికల సమయంలో జరిగిన వివాదం కారణంగానే మెగా ఫ్యామిలీ మౌనం పాటిస్తున్నారని అందరూ భావించారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు అల్లు అర్జున్ మద్దతు తెలపకుండా తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లినప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న తరుణంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పుష్ప టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీంకు నా హృదయపూర్వక బ్లాక్ బాస్టర్ శుభాకాంక్షలు అంటూ ఈయన విషెస్ తెలియజేశారు.అయితే ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ పై కోపంతో ఏకంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అలాగే తన భార్య స్నేహా రెడ్డిని కూడా అన్ ఫాలో చేశారు.
ఇప్పుడు విషెస్ చెప్పడంతో ఇది కాస్త సంచలనగా మారింది.మరి సాయి తేజ్ చేసిన ఈ పోస్ట్ పట్ల అల్లు అర్జున్ స్పందించి రిప్లై ఇస్తారా.
లేదా అనేది తెలియాల్సి ఉంది.