కోలీవుడ్ ఇండస్ట్రీలో జయంరవికి( Jayam Ravi ) ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఈ హీరో తాజాగా విడాకులు( Divorce ) తీసుకుంటున్నానని సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన సోషల్ మీడియా వేదికగా ఒకింత వైరల్ అయింది.
అయితే భార్యకు గౌరవం ఇవ్వాలంటూ ఖుష్బూ( Khushbu ) షాకింగ్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.తన కుటుంబంను సమాజంలో ఉన్నతంగా ఉంచాలనే వ్యక్తి ప్రేమించిన వారి అవసరాలు, కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తాడని ఖుష్బూ అన్నారు.
పెళ్లి అనే బంధంలో ఎత్తుపల్లాలు అనేవి సహజమని చిన్నచిన్న తప్పులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.అంత మాత్రాన బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.ప్రేమ అనేది అప్పుడప్పుడూ తగ్గొచ్చని ఖుష్బూ పేర్కొన్నారు.గౌరవం, మర్యాద అనేది చెక్కు చెదరకుండా ఉండాలని పురుషుడు తన భార్యకు సరైన గౌరవం ఇవ్వాలని ఖుష్బూ చెప్పుకొచ్చారు.
స్వార్థంతో ఉండే వ్యక్తి తన పనుల వల్ల మిగతా వాళ్ల మనస్సులు ఎలా బాధ పడతాయనేది చూడలేదని ఖుష్బూ పేర్కొన్నారు.ఇలాంటి ప్రవర్తన వల్ల కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.జీవితం చాలా అందమైనదని కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి ఉంటుందని ఖుష్బూ చెప్పుకొచ్చారు.కానీ అప్పటికే ఆలస్యం కావచ్చని ఆమె తెలిపారు.
అప్పటికే ఆలస్యం కావచ్చని తన భార్యను గౌరవించలేని వ్యక్తి లైఫ్ లో ఎదగడని నిన్ను లవ్ చేసిన, తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం అని ఖుష్బూ వెల్లడించారు.గౌరవం అనేది కుటుంబంలో ఉండాలని ఈ విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోయినట్లేనని ఖుష్బూ తెలిపారు.
ఖుష్బూ పెళ్లి బంధం గురించి, విడాకుల గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.జయం రవి విడాకులకు ఒక సింగర్ కారణమని కామెంట్లు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
జయం రవి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.