మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.తన సినీ కెరీర్ లో చిరంజీవి ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకోవడంతో పాటు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.తెలుగులో చిరంజీవి నటించిన సినిమాలలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే.150కు పైగా సినిమాలలో నటించిన చిరంజీవి పాటలు, డ్యాన్స్ లతో రికార్డ్ సృష్టించారని తెలుస్తోంది.
ఒక పెద్ద సంస్థ చిరంజీవికి వరల్డ్ రికార్డ్ ను ప్రకటించబోతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఒక కార్యక్రమంలో ఈ వరల్డ్ రికార్డ్ ను ప్రకటించనున్నారని భోగట్టా. కోహినూర్ హోటల్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది.చిరంజీవి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా( Vishwambhara )తో బిజీగా ఉండగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదల కానుంది.మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.చిరంజీవికి వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా పలువురు దర్శకులు చెప్పిన కథలను చిరంజీవి వింటున్నారని తెలుస్తోంది.చిరంజీవి వేగంగా సినిమాలు చేయాలని భావించినా ఆచార్య, భోళా శంకర్ సినిమాల ఫలితాల వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
చిరంజీవి కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.