స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) ఇతర హీరోలకు భిన్నమని చెప్పవచ్చు.చాలామంది స్టార్ హీరోలు ఔట్ డోర్ షూటింగ్ రిస్క్ అని భావిస్తే బాలయ్య మాత్రం తనకు ఔట్ డోర్ షూటింగ్ అంటే ఇష్టమని బాలయ్య చెబుతారు.
అభిమానులకు బాలయ్య ఇచ్చే ప్రాధాన్యత మాటల్లో మాత్రమే కాదు చేతల్లో కూడా కనిపిస్తుంది.బాలయ్యకు కోపం ఎక్కువని ఎవరైతే ఫీలవుతారో ఒకసారి బాలయ్యను కలిస్తే వాళ్లే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.
అభిమాని గృహప్రవేశానికి( Fan house warming cermony ) స్టార్ హీరో బాలయ్య వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.స్టార్ హీరో బాలయ్య మా గృహప్రవేశానికి రావడం లైఫ్ లో ఎప్పటికీ మరిచిపొలేని జ్ఞాపకం అని చిన్న పరిచయంతో బాలయ్యను ఇన్వైట్ చేయగా బిజీ షెడ్యూల్ ఉన్నా మా ఇంటి గృహ ప్రవేశానికి వచ్చి దాదాపుగా 3 గంటలు ఉండటం అంటే ఆయన మంచి మనస్సుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని కామెంట్లు చేశారు.
బాలయ్య లాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ ను నేనైతే లైఫ్ లో చూడలేదని అభిమాని పేర్కొన్నారు.మా ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడారని మా అందరితో కలిసి లంచ్ కూడా చేశారని ఆరోజు మా అందరికీ కలలా అనిపించిందని ఆ ఫ్యాన్ చెప్పుకొచ్చారు.బాలయ్య గురించి చెప్పడానికి మాటలు సరిపోవని ఆ అభిమాని వెల్లడించారు.బాలయ్య ఓపికకు హ్యాట్సాఫ్ అని ఫ్యాన్ పేర్కొన్నారు.
బాలయ్య లాంటి హీరోలు చాలా తక్కువమంది ఉంటారని చెప్పవచ్చు. బాలయ్య రెమ్యునరేషన్( Balayya Remuneration ) ప్రస్తుతం 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా విడుదలైన వెంటనే అఖండ2 సినిమాతో బిజీ కానున్నారు.అఖండ2 సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య బిజీ అవుతుండటం గమనార్హం.