మనలో చాలా మంది లగ్జరీ బ్రాండ్లలో వస్తువులను కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు.ఎప్పటికప్పుడు లగ్జరీ బ్రాండ్ ల నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయా అని ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు.
ప్రస్తుతం ప్రద అనే ఒక ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మార్కెట్లోకి సరికొత్త డిజైన్ తో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ను లాంచ్ చేసింది.ఈ మెటాలిక్ టాటే బ్యాగ్( Metallic Tote Bag ) ఖరీదు ఏకంగా రూ.2.73 లక్షలు అంటే నమ్మండి.వాస్తవానికి ఈ హ్యాండ్ బ్యాగులు మహిళల కోసం కాకుండా ప్రత్యేకంగా పురుషుల కోసం డిజైన్ చేశారట.అయితే., వాస్తవానికి ఈ బ్యాగ్ డిజైన్ మాత్రం చాలా విమర్శలు ఎదురవుతున్నాయి.ఎందుకు అంటే భారతీయ బస్సులు, రైలు ఫ్లోర్లలో ఉపయోగించే డిజైన్ ఈ బ్యాగ్ కోసం ఉపయోగించారు.
ఈ బ్యాగ్ డిజైన్ లో మెటాలిక్ బ్యాగ్, హాట్-స్టాంప్డ్ లెదర్ మోటిఫ్‌ను కలిగి ఉంది.ఇక ఈ బ్యాగులో డడస్ట్ బ్యాగ్, డెడికేటెడ్ వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్ తో సాధారణంగా ఉంది.ప్రస్తుతం ఈ బ్యాగ్ డిజైన్ పై కాస్త విపరీతమైన ట్రోల్స్ సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో కొంతమంది ఇది ఏమైనా ఫ్యాషన్ ఫార్మేట్( Fashion format ), విచిత్రమైన డిజైన్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే.ఇక మరికొందరు ఈ బ్యాగ్ కోసం అంత ధర ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకాకొందరు.
.ఇండియన్ బస్సుల నుంచి స్ఫూర్తి పొందారా.?, చాలా ఫన్నీగా ఉంది.అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చాలామంది అసలు ఇలాంటి ఐడీయాలు ఎలా వస్తాయి అంటూ కామెంట్ చేసే వారు కూడా లేకపోలేదు.