ఖాళీ కడుపుతో ఈ పండ్లను పొరపాటున కూడా తినకూడదు.. తెలుసా?

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరాల్లో పండ్లు ఒకటి.ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి.

 Which Fruits Are Avoided On An Empty Stomach? Fruits, Empty Stomach, Watermelons-TeluguStop.com

అవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు అనేక జబ్బుల నుంచి రక్షించడానికి ఎంతో ఉత్తమంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అందుకే రోజుకు రెండు రకాల పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ ఖాళీ కడుపుతో కొన్ని రకాల పండ్లను పొరపాటున కూడా తీసుకోరాదు.అటువంటి పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ త‌యారు చేసుకునే స‌మ‌యం లేక చాలా మంది ఖాళీ క‌డుపుతో యాపిల్( Apple ) తింటూ ఉంటారు.అయితే యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

అందువ‌ల్ల ఇవి ఉబ్బరం, గ్యాస్( Bloating, gas ) మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.అలాగే ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌ని పండ్ల‌లో అర‌టి ఒక‌టి.

అర‌టి పండ్లలో( bananas ) సహజ చక్కెరలు మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కార‌ణం అవుతాయి.

మ‌రియు కొంద‌రిలో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తేలా కూడా చేస్తాయి.

Telugu Apple, Bananas, Empty Stomach, Tips, Latest, Papaya, Pineapple, Fruitsavo

ఖాళీ క‌డుపులో సిట్ర‌స్ పండ్ల‌ను కూడా తీసుకోరాదు.నారింజ, క‌మ‌లా ( Orange )వంటి సిట్రస్ పండ్లు మీ ప్రేగుల్లో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి.పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.

మీ జీర్ణవ్యవస్థ ప‌నితీరును దెబ్బ తీస్తాయి.ఉద‌యం ఖాళీ క‌డుపుతో పుచ్చ‌కాయ( watermelon ) కూడా తీసుకోరాదు.

ఈ పుచ్చ‌కాయ‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా ఫ్రక్టోజ్ జీర్ణ అసౌకర్యం మరియు వికారాన్ని కలిగిస్తుంది.

Telugu Apple, Bananas, Empty Stomach, Tips, Latest, Papaya, Pineapple, Fruitsavo

ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌ని పండ్ల జాబితాలో బొప్పాయి, పైనాపిల్ ( Papaya, pineapple )వంటివి సైతం ఉన్నాయి.బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇవి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.క‌డుపులో ఇరిటేష‌న్ ను క‌ల‌గ‌జేస్తాయి.కాబట్టి ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ పైన చెప్పుకున్న పండ్ల‌ను ఖాళీ క‌డుపుతో తిన‌క‌పోవ‌డ‌మే ఎంతో ఉత్త‌మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube