ఏపీలో ఎన్నికలకు ముందు ఆరా సర్వే( Aaraa Survey ) పేరుతో రాజకీయ సంచలనం సృష్టించారు ఆ సర్వే సంస్థ అధినేత మస్తాన్.( Mastan ) ఊహించని స్థాయిలో వైసీపీకి( YCP ) స్థానాలు దక్కబోతున్నాయని ఆరా సర్వే ఫలితాలు వెలబడ్డాయి.
అయితే ఎన్నికల తరువాత 175 స్థానాలకు కేవలం 11 స్థానాలను మాత్రమే వైసిపి గెలుచుకోవడంతో ఎన్నికల తరువాత ఆరా సర్వే, ఆరా మస్తాన్ ట్రోలింకు గురయ్యారు.ఆరా సర్వేను జగన్ గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆరా సర్వే ఫలితాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలుపడ్డాయి.టిడిపి, జనసేన ,బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఎన్నికలకు ముందు మీడియా సమావేశం పెట్టి మరి జగన్ విజయం సాధిస్తారని ఆరా సర్వే సంస్థ అధినేత మస్తాన్ ప్రకటించారు.
తనకు ఎన్నో రాష్ట్రాల్లో పని చేసిన అనుభవం ఉందని , అదే అనుభవంతో ఏపీ ఎన్నికలను అంచనా వేస్తున్నానని తెలిపారు.మస్తాన్ చెప్పిన ప్రకారం జగన్ కు( Jagan ) వందకు పైగా సీట్లు వస్తాయని కూటమికి 60 నుంచి 70 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు దీనికి భిన్నంగా వెలుపడ్డాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు( Jamili Elections ) రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా సర్వే సంస్థ అధినేత మస్తాన్ మరోసారి రాజకీయ రచ్చ రేపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు.
తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల పైన మస్తాన్ స్పందించారు.పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్ లో ఎందుకు పొందుపరచలేదని, ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో ఉండాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం( Election Commission ) సమాధానం ఇవ్వాలని మస్తాన్ కోరుతున్నారు.