వైరల్ వీడియో: పిల్లలు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు రోడ్లపై విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇలా విచిత్రమైన విన్యాసాలు చేసి రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

 The Children Of The Viral Video Should Be Ashamed Of What They Have Done, Stude-TeluguStop.com

ఈ క్రమంలో చాలామంది చేసే విచిత్ర విన్యాసాలను( Strange stunts ) చూసి అందరూ ఆశ్చర్యానికి లోను అవుతూ ఉంటే.మరికొందరు ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.

అచ్చం అలాగే తాజా ఒక సంఘటన చోటుచేసుకుంది.

ఇద్దరు స్నేహితులు కలిసి ఒకటే సైకిల్ తొక్కడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవ్వడంతో పాటు ఇద్దరు కలిసి సైకిల్ తొక్కడం ఏంటి అని ముక్కు మీద చేయి వేసుకుంటున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ఇద్దరు పిల్లలు కలిసి స్కూల్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.వారిలో ఒకరు యూనిఫామ్, బ్యాగు ( Uniform, bag )తగిలించుకొని తన సైకిల్ పై బయటకు వచ్చాడు.

ఈ క్రమంలో మరొక బాలుడు సైకిల్ లేకపోవడంతో ఇద్దరూ కలిసి ఒకే సైకిల్ పై స్కూలుకు స్టార్ట్ అయ్యారు.ఇంతవరకు అంతా బాగుంది.కానీ, ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.ఒకరు వెనకాల మరొకరు కూర్చొని సైకిల్ తొక్కడం నచ్చని ఆ ఇద్దరూ.

ఆ కష్టాన్ని కూడా సగం సగం పంచుకోవాలని నిర్ణయం తీసుకొని.వారు ఇద్దరు సైకిల్ కు రెండువైపులా పెడల్స్ పై రెండు కాళ్ళను పెట్టి తొక్కడం మొదలుపెట్టేశారు.

అలా హ్యాండిల్ ను కూడా గట్టిగా పట్టుకొని ఎంతో చాక చక్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయారు.ఇలా వీరిద్దరూ చేసిన పనిని చూసి రోడ్డుపై వెళ్లే వారందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.సైకిల్ ను ఇలా కూడా ఉపయోగిస్తారా అని కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు.వీరిద్దరి ట్యాలెంట్ గురించి కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube