ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో ప్రజలను ప్రధానంగా వేధించే వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి.
ఏడీస్ దోమల కారణంగా ఇది వ్యాప్తి చెందుతుంది.డెంగ్యూ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, ఒంటి పైన దద్దుర్లు రావడం, తలనొప్పి, ఆలసట, నీరసం, తెల్ల రక్త కణాలు ఉన్నట్టుండి పడిపోవడం, ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలను నివారించుకుని డెంగ్యూ నుంచి త్వరగా బయట పడాలంటే ఖచ్చితంగా డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.మరి అవేంటో ఓ లుక్కేసేయండి.
డెంగ్యూ వ్యాధిని ఫాస్ట్‌గా తగ్గించడంలో ఆకుకూరలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా తోటకూర, పాలకూర, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర వంటివి డైట్‌లో చేర్చుకుంటే.
ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో అవి ఎంతగానో తోడ్పడతాయి.
అలాగే పైన చెప్పుకున్నట్టు డెంగ్యూ సోకిన వారిలో ప్లేట్ లెట్ కౌంట్ భారీగా తగ్గిపోతుంది.అయితే బొప్పాయి ఆకులు ప్లేట్ లెట్ కౌంట్‌ను అమాంతం పెంచడంలో సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.అందువల్ల, డెంగ్యూ వ్యాధితో బాధ పడే వారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే మంచిది.
టమాటా జ్యూస్ లేదా టమాటాతో వండిన ఆహారాలు తీసుకుంటే.అందులో ఉండే విటమిన్ సి మరియ యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.
దాంతో డెంగ్యూ వ్యాధి వేగంగా తగ్గు ముఖం పడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే.అయితే డెంగ్యూ జ్వరం నుండి త్వరగా కోలుకునేందుకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది.అందువల్ల, డెంగ్యూ సోకిన వారు.
తమ డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చుకోవడం ఉత్తమం.
ఇక వీటితో పాటుగా అరటి పండ్లు, నల్ల ద్రాక్ష, దానిమ్మ పండు రసం, కొబ్బరి నీరు, తులసి టీ, గ్రీన్ టీ, ఉసిరి కాయలు, పసుపు పాలు, గుడ్డు వంటివి తీసుకుంటే.
డెంగ్యూ బారి నుంచి త్వరగా బయట పడొచ్చు.