ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు హిందీలో కలెక్షన్లను( Hindi Collections ) టార్గెట్ చేస్తున్నాయి.హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తే మాత్రమే సినిమా హిట్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.హిందీలో బాహుబలి2( Baahubali 2 ) కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసి పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ వార్తల్లో నిలిచింది.బాహుబలి2 ఫుల్ రన్ లో 510.99 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సొంతంచేసుకుంది.అయితే ఈ సినిమా కలెక్షన్లను పుష్ప2 సులువుగా బ్రేక్ చేసింది.
హిందీలో పుష్ప2 కలెక్షన్లు 561.50 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.సెకండ్ వీకెండ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సినిమా పుష్ప2( Pushpa 2 ) మాత్రమే కావడం గమనార్హం.పుష్ప2 మూవీ సాధించిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతంషాకవుతున్నాయి.

పుష్ప2 హిందీ ఫుల్ రన్ కలెక్షన్లు 700 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టించింది.బన్నీ పుష్ప1, పుష్ప2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారనే చెప్పాలి.పుష్ప2 సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం గమనార్హం.

పుష్ప2 ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో పుష్ప3 ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.పుష్ప ది ర్యాంపేజ్( Pushpa The Rampage ) మరో రెండేళ్ల తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది.పుష్ప ది ర్యాంపేజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప ది ర్యాంపేజ్ ఎంత బడ్జెట్ తో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.బన్నీ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.