సినీ నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చలకు కారణం అవుతుంది.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడమే కాకుండా ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.
ఇలా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని అందుకు ఆయన బాధ్యున్ని చేస్తూ పోలీసులు అరెస్టు( Arrest ) చేస్తున్న సంగతి తెలిసిందే.ఇలా బన్నీ అరెస్ట్ అయిన కాసేపటికే మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇక అల్లు అర్జున్ అరెస్టు కావటాన్ని ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.ఈ క్రమంలోనే నటుడు సుమన్( Actor Suman ) సైతం అల్లు అర్జున్ అరెస్టు విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ విషయంలో అల్లుఅర్జున్ ని అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పు.హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి.క్రౌడ్ కు తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి.ఒక యాక్టర్ గా థియేటర్ కు వెళ్లడం అల్లు అర్జున్ చేసింది తప్పే కాదు .ఈ ఘటన ఒక హెచ్చరిక.దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్లకు పిలచండి.

ఒక నిండు ప్రాణం పోయింది ఆ బాధ తీర్చలేనిది.ఒక అభిమాని ప్రాణం పోవడం ఎంతో బాధాకరం అని తెలిపారు.గతంలో ఇలాంటి ఘటనలలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.వాటి గురించి ఎవరు మాట్లాడటం లేదు వారిపై ఎవరు చర్యలు తీసుకోలేదు.వారికి ఒకరు అల్లు అర్జున్ కి ఒక రూలా అంటూ అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పట్ల సుమన్ తీవ్రంగా ఖండిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.