రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..

2019లో మెరెడిత్ టాబోన్( Meredith Tabone ) అనే చికాగో ఫైనాన్షియల్ అడ్వైజర్ ( Chicago Financial Advisor )ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది.ఆమె ఇటలీలోని సంబుకా డి సిసిలియా పట్టణంలో కేవలం $1.05 (మన కరెన్సీలో దాదాపు రూ.90)తో ఒక ఇల్లు కొనేసింది! జనాభా తగ్గిపోతున్న ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇటలీ ప్రభుత్వం ఈ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది.మెరెడిత్ ముత్తాత ఒకప్పుడు సంబుకాలోనే ఉండేవారు.అందుకే ఆమె ఇలా ఒక సాహసం చేసింది.కనీసం ఇల్లు ఎలా ఉందో కూడా చూడకుండా ఆన్‌లైన్‌లో బిడ్ వేసింది, అంతే, లక్ కలిసొచ్చింది, గెలిచేసింది.

 She Bought A House Under Rs. 100 And Now You Will Be Surprised To See The Look O-TeluguStop.com

కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాత రివిల్ అయింది.

మెరెడిత్ కొన్న ఇల్లు చూస్తే ఎవరైనా భయపడతారు.కరెంటు లేదు, నీళ్లు లేవు, నేలంతా పావురాల రెట్టతో నిండిపోయింది.దాన్ని క్లీన్ చేయడానికి, లీగల్ పేపర్స్ కోసం ఇంకొన్ని డబ్బులు కలిపి మొత్తం $6,200 (దాదాపు రూ.5 లక్షలు) ఖర్చు చేసింది.అయితే, ఆ ఇల్లు తన అవసరాలకు సరిపోదని ఆమె గ్రహించింది.దాంతో, పక్కనే ఉన్న ఇంకో ఇంటిని 23,000 డాలర్లు (దాదాపు రూ.19.5 లక్షలు)కు కొనుగోలు చేసింది.రెండూ కలిపి ఒక పెద్ద ఇల్లుగా మార్చేసింది.

అయితే ఆ ఇంటిని బాగు చేయడానికి మొదట 40,000 డాలర్లు( 40,000 dollars ) (దాదాపు రూ.34 లక్షలు) ఖర్చు అవుతుందని అనుకుంటే, చివరికి 446,000 డాలర్ల (దాదాపు రూ.4 కోట్లు) ఖర్చు వచ్చింది.అంటే అనుకున్న దానికంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ.ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏకంగా మూడు సంవత్సరాలు పట్టింది.“ఇల్లు రిపేర్ చేయడం నరకంలా అనిపించింది” అని మెరెడిత్ స్వయంగా చెప్పింది.అయినా పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది.ప్రొఫెషనల్స్‌ సహాయం తీసుకున్నప్పటికీ, ఇంటి డిజైన్‌లో మాత్రం తన క్రియేటివిటీ మొత్తం చూపించింది.ఇప్పుడు ఆ ఇల్లు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.అంత అందంగా ఉంది, చాలా మంది కొంటామన్నా టాబ్బోన్ మాత్రం అమ్మనని తెగేసి చెబుతోంది.

ఆమె తాజాగా షేర్ చేసిన వీడియో చూస్తే మీరు కూడా అది సూపర్ గా ఉందని అంటారు.

సంబుకా పట్టణం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ మాత్రం సూపర్ హిట్ అయింది.మెరెడిత్ లాంటి వాళ్లను చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు.ఇప్పుడు అక్కడ ఇళ్ల ధర 3 డాలర్ల (దాదాపు రూ.260) నుంచి మొదలవుతోంది.ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు 250కి పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి.దీని ద్వారా ఆ పట్టణానికి $21.5 మిలియన్ల ఆదాయం వచ్చిందని, సాంబూకా ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిందని ఆ పట్టణ మేయర్ గియుసేప్ కాసియోప్పో గర్వంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube