రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..
TeluguStop.com
2019లో మెరెడిత్ టాబోన్( Meredith Tabone ) అనే చికాగో ఫైనాన్షియల్ అడ్వైజర్ ( Chicago Financial Advisor )ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది.
ఆమె ఇటలీలోని సంబుకా డి సిసిలియా పట్టణంలో కేవలం $1.05 (మన కరెన్సీలో దాదాపు రూ.
90)తో ఒక ఇల్లు కొనేసింది! జనాభా తగ్గిపోతున్న ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇటలీ ప్రభుత్వం ఈ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది.
మెరెడిత్ ముత్తాత ఒకప్పుడు సంబుకాలోనే ఉండేవారు.అందుకే ఆమె ఇలా ఒక సాహసం చేసింది.
కనీసం ఇల్లు ఎలా ఉందో కూడా చూడకుండా ఆన్‌లైన్‌లో బిడ్ వేసింది, అంతే, లక్ కలిసొచ్చింది, గెలిచేసింది.
కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాత రివిల్ అయింది.మెరెడిత్ కొన్న ఇల్లు చూస్తే ఎవరైనా భయపడతారు.
కరెంటు లేదు, నీళ్లు లేవు, నేలంతా పావురాల రెట్టతో నిండిపోయింది.దాన్ని క్లీన్ చేయడానికి, లీగల్ పేపర్స్ కోసం ఇంకొన్ని డబ్బులు కలిపి మొత్తం $6,200 (దాదాపు రూ.
5 లక్షలు) ఖర్చు చేసింది.అయితే, ఆ ఇల్లు తన అవసరాలకు సరిపోదని ఆమె గ్రహించింది.
దాంతో, పక్కనే ఉన్న ఇంకో ఇంటిని 23,000 డాలర్లు (దాదాపు రూ.19.
5 లక్షలు)కు కొనుగోలు చేసింది.రెండూ కలిపి ఒక పెద్ద ఇల్లుగా మార్చేసింది.
"""/" /
అయితే ఆ ఇంటిని బాగు చేయడానికి మొదట 40,000 డాలర్లు( 40,000 Dollars ) (దాదాపు రూ.
34 లక్షలు) ఖర్చు అవుతుందని అనుకుంటే, చివరికి 446,000 డాలర్ల (దాదాపు రూ.
4 కోట్లు) ఖర్చు వచ్చింది.అంటే అనుకున్న దానికంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ.
ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏకంగా మూడు సంవత్సరాలు పట్టింది."ఇల్లు రిపేర్ చేయడం నరకంలా అనిపించింది" అని మెరెడిత్ స్వయంగా చెప్పింది.
అయినా పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది.ప్రొఫెషనల్స్ సహాయం తీసుకున్నప్పటికీ, ఇంటి డిజైన్‌లో మాత్రం తన క్రియేటివిటీ మొత్తం చూపించింది.
ఇప్పుడు ఆ ఇల్లు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.అంత అందంగా ఉంది, చాలా మంది కొంటామన్నా టాబ్బోన్ మాత్రం అమ్మనని తెగేసి చెబుతోంది.
ఆమె తాజాగా షేర్ చేసిన వీడియో చూస్తే మీరు కూడా అది సూపర్ గా ఉందని అంటారు.
"""/" /
సంబుకా పట్టణం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ మాత్రం సూపర్ హిట్ అయింది.
మెరెడిత్ లాంటి వాళ్లను చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు.ఇప్పుడు అక్కడ ఇళ్ల ధర 3 డాలర్ల (దాదాపు రూ.
260) నుంచి మొదలవుతోంది.ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు 250కి పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి.
దీని ద్వారా ఆ పట్టణానికి $21.5 మిలియన్ల ఆదాయం వచ్చిందని, సాంబూకా ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిందని ఆ పట్టణ మేయర్ గియుసేప్ కాసియోప్పో గర్వంగా చెబుతున్నారు.
రాజమౌళి ఆర్టిస్టులను అనౌన్స్ చేసే రోజు ఎప్పుడో తెలిసిపోయిందిగా..?