బోస్టన్‌లోనూ "చుట్టమల్లే" సాంగ్ ఫీవర్.. టెరిఫిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు!

“దేవర” సినిమాలోని “చుట్టమల్లే” పాట ( “Chuttamalle” song )ఇప్పుడు సోషల్ మీడియాలో యమ ట్రెండ్‌ అవుతోంది.ఎక్కడ చూసినా ఈ పాటకు రీల్స్, డ్యాన్స్ వీడియోలతో ఒక ఊపు ఊపిస్తున్నారు.

 chuttamalle Song Fever Rocked With Terrific Dance Performance In Boston Too, Dev-TeluguStop.com

ఇందులోని జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల ( Jr.NTR, Janhvi Kapoor )స్టెప్పులకు యూత్ ఫిదా అయిపోతున్నారు.ఈ క్రేజ్ ఇప్పుడు బోస్టన్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీకి కూడా పాకింది.

అక్కడ చదువుతున్న కొందరు భారతీయ విద్యార్థులు “చుట్టమల్లే” పాటకు అద్భుతమైన స్టెప్పులేసి అదరగొట్టారు.

చరణ్ పసుమర్తి, అన్మోల్ శెట్టి( Charan Pasumarthy, Anmol Shetty ) లీడ్‌లో జరిగిన ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాలేజీ ఈవెంట్‌లోనే హైలైట్‌గా నిలిచింది.ఒరిజినల్ కొరియోగ్రఫీని ఫాలో అవుతూ, అచ్చం ఎన్టీఆర్, జాన్వీలాగే ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు.

వాళ్ల సింక్, డ్యాన్స్ చూసి అక్కడున్న వాళ్లంతా విజిల్స్, కేకలతో హోరెత్తించారు.ఈ వీడియోను చరణ్ పసుమర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో “హ్యాపీ సింగిల్స్ డే” అంటూ పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.

అలా చేయగానే ఇలా వీడియో వైరల్ అయిపోయింది, నెటిజన్లు వీరి పెర్ఫార్మెన్స్ చూసి వావ్ అంటున్నారు.కామెంట్ చేస్తూ, “ఇది పక్కా ఎనర్జీ ఫుల్ పెర్ఫార్మెన్స్! ప్రతి సెకను ఎంజాయ్ చేశాను” అని అన్నారు.మరొకరు, “కొరియోగ్రఫీ అదిరిపోయింది! ఇలాంటి ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉంది” అని చెప్పారు.ఇంకొకరు, “ప్రేక్షకుల స్పందనే అన్ని విషయాలు చెబుతోంది, అద్భుతమైన ప్రదర్శన!” అని రాశారు.

చాలా మంది స్టూడెంట్ల టైమింగ్, స్టెప్పులను మెచ్చుకుంటూ “ఇది ఔట్ స్టాండింగ్ టాలెంట్” అని, “వాళ్ల సింక్రోనైజేషన్ చూస్తే గూస్‌బంప్స్ వచ్చాయి!” అని కామెంట్ చేశారు.

తారక్, జాన్వీ కపూర్ రొమాంటిక్ సాంగ్‌గా వచ్చిన “చుట్టమల్లే” ఈ సంవత్సరం మోస్ట్ లవ్డ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.దీనికి కారణం పాట క్యాచీ బీట్స్, అద్భుతమైన కొరియోగ్రఫీయే.ఇప్పుడు ఈ విద్యార్థుల ఎనర్జిటిక్, స్కిల్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాట పాపులారిటీ మరింత పెరిగింది.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube