తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శంకర్… ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు ఆయన చేసిన భారతీయుడు 2 (Indian 2 )సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు.
మరి ఈ సినిమా విషయంలో ఆయన వేసిన అంచనాలన్ని తారుమారుమవ్వడం తో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఇక ఎలాగైనా సరే ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని శంకర్ భారీ ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నాడు.
మరి ఈ సినిమా విషయంలో ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలావరకు సక్సెస్ సాధించే విధంగానే ఉన్నాయి.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు మిగతా స్టార్ డైరెక్టర్ల కంటే వెనుకబడి పోతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఏది ఏమైనప్పటికీ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతోనే అందరికీ సమాధానం చెప్పాలని శంకర్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ముఖ్యంగా శంకర్ కి కథల విషయంలోనే చాలా వరకు సమస్యలైతే వస్తున్నాయి.
మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ సుబ్బరాజు కథ తీసుకున్నాడు.

కాబట్టి ఈ కథ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని ఈ సినిమా పక్కాగా సూపర్ సక్సెస్ అవుతుందని తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని వదలడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో అటు రామ్ చరణ్ ఇటు శంకర్ ఇద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…ఈ సినిమాతో సక్సెస్ వస్తే ఇద్దరు పాన్ ఇండియాలో స్టార్లు వెలుగొందుతారు…
.