మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి(Balineni Srinivasa Reddy) రాజకీయంగా అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. వైసీపీకి రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అసమ్మతినేతగా ఆయన గుర్తింపు పొందరు.
రెండోసారి మంత్రివర్గ విస్తరణలో జగన్ తనను కొనసాగించకపోవడం, తమ జిల్లాకి చెందిన ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) ను కొనసాగించడం వంటివి బాలినేని కి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
అప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతితోనే ఉంటూ వస్తున్నారు.
అయితే ఇటీవలే వైసిపికి రాజీనామా చేశారు.జనసేన లో చేరేందుకు సిద్ధమవుతుండగా టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి(Damachrala Janardhan Reddy) నుంచి ఊహించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
వీరి మధ్య ఫ్లెక్సీ వార్ కూడా మొదలైంది.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, ఊహించని విధంగా ఒంగోలు రాజకీయం మారిపోయింది.
మొదటి నుంచి బాలనేని కి దామచర్ల జనార్ధన్ కు మధ్య రాజకీయ వైరం ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండేవారు .కొద్దిరోజుల క్రితం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ వివాదానికి కారణం అయ్యాయి ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో కూడా ముద్రించడంపై టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయించి వెంటనే వాటిని తొలగింప చేశారు .
ఇకపై ఇటువంటి ఫ్లెక్సీలు(Flexi) మరోసారి వేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇంకా బాలినేని పార్టీలో చేరకుండానే వీరి మధ్య వివాదం మరోసారి రాజుకుంది.బాలినేని జనసేన లో చేరినా దామచర్ల తో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.ఈ మేరకు నిన్న బాలినేని వంటి అవినీతిపరుడుని ఏ పార్టీలోకి వెళ్లిన వదిలేది లేదని, అతనిని అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damachrala Janardhan)అన్నారు.టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై దామచర్ల జనార్ధన్ ఈ కామెంట్స్ చేశారు .” గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేసాం .
ఒంగోలులో టిడిపి(TDP in Ongole) శ్రేణులపైనా, నాపైనా బాలనేని 32 కేసులు పెట్టారు.మా నాయకుడు చంద్రబాబును(Chandrababu) కూడా దూషించారు.అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు.జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు.ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లోంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు.గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం.
వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు .ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టిడిపి, జనసేన, బిజెపి (TDP, Jana Sena, BJP) శ్రేణులకు అండగా ఉంటాం.పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాల నుంచి వైదొలుగుతామని దామచర్ల సంచల వ్యాఖ్యలు చేశారు.