ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది.బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా చూసే ప్రతి ఆడియన్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయి తెలుగు సినిమాని ఆదరిస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా స్థాయి అనేది భారీ రేంజ్ లో పెరిగిపోయింది.ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) మొదటి స్థానంలో ఉంది అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెబుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న కథల పైన మన దర్శకులు( Directors ) మరికొంత ఫోకస్ చేయాల్సిన అవసరమైతే ఉంది.ఎందుకంటే ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మనల్ని మించిన తోపు డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలో లేరు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాం.
ఇక ఇప్పటికే రాజమౌళి( Rajamouli ) కూడా పాన్ ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడుగా కొనసాగుతున్నాడ.కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రత్యేకమైన గౌరవమైతే ఉంది.మరలాంటి గౌరవాన్ని దక్కించుకోవడం ఓకేతైతే దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం అనేది మరొక ఎత్తుగా మారింది.మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్( Young Directors ) ఇప్పుడు సరికొత్త సినిమాలతో వచ్చి ప్రయోగాలను చేస్తున్నారు.
వాళ్లకు తగ్గట్టుగానే ఆ సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో వాళ్లు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మన్ననలను పొందుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది.మరి ఇలాంటి సందర్భంలో మన హీరోలు గానీ, దర్శకులు గానీ సినిమా క్వాలిటీల పైన మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి ఇక మీద వచ్చే సినిమాతో మన దర్శకులు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…
.