సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాల పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా( Ap Deputy CM ).
మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.
సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు( Film Industry ) సంబంధించిన ఇబ్బందులు ఆయనకు తెలుసు కనుక ఇండస్ట్రీకి వీలైనంతవరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఎన్నో ఇబ్బందులను కలగజేసింది.టికెట్ల రేట్లు తగ్గించడం బెనిఫిట్ షోలకు అనుమతి లేకపోవడం వంటివి చిత్ర పరిశ్రమకు ఎంతో ఇబ్బందికరంగా మారాయి.కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి ఇవ్వడం అదనపు షోలకు కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
తాజాగా ఎన్టీఆర్( NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara Movie ) కి కూడా అనుమతి తెలపడంతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విధంగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వీరి ట్వీట్ల పై స్పందిస్తూ.ఎన్టీఆర్ గారికి ఆల్ ది బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు.దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ.
NDA గవర్నమెంట్ లో ఏపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి రాజకీయ, వ్యక్తుల అనుబంధాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సపోర్ట్ చేస్తాము.గత ప్రభుత్వం మాదిరి సినిమా వాళ్ళను కష్ట పెట్టమని తెలిపారు.
గత ప్రభుత్వం నిర్మాతలను నటీనటులను ఎంత ఇబ్బంది పెట్టారో స్వయంగా చూసాము కనుక మా ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.