బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు తప్పనిసరిగా బిగ్ బాస్ పెట్టే రూల్స్ పాటించాల్సిందే.బిగ్ బాస్ రూల్స్ కఠిన తరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు తప్పనిసరిగా పాటించాలి.
వారు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే బిగ్ బాస్ చెప్పినట్టుగానే వినాలి.అయితే ప్రస్తుతం తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ ప్రసారం అవుతుంది.
ఇలా ఎనిమిదవ సీజన్ ప్రసారంలో భాగంగా పాల్గొన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ఇద్దరు బయటకు వచ్చారు.అయితే ఈ వారం అభయ్ ( Abhay ) ఎలిమినేట్వు అవుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటివరకు హౌస్ లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లలో ది వరెస్ట్ కంటెస్టెంట్ గా ఈయన పేరు సంపాదించుకున్నారు.బిగ్ బాస్ కార్యక్రమం గురించి హేళన చేస్తూ మాట్లాడటమే కాకుండా తన భార్యతో కొట్లాడి ఇలాంటి టాస్కులు ఇస్తున్నారని బిగ్ బాస్ గురించి ఎంతో హేళనగా మాట్లాడారు.దీంతో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున (Nagarjuna ) తన పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేయాలని చెప్పారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంటుంది.ఇక ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు వెంటనే రెమ్యూనరేషన్ ( Remuneration ) ఇవ్వరు.వారికి రెమ్యూనరేషన్ ఇవ్వటానికి కాస్త సమయం పడుతుంది.
ఇక బిగ్ బాస్ గురించి కంటెస్టెంట్లు తప్పుడు ప్రచారం చేసిన తప్పుగా మాట్లాడిన కొన్ని సందర్భాలలో రెమ్యూనరేషన్ కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి.ప్రస్తుతం అభయ్ వ్యవహారం కూడా ఇలాగే ఉండబోతుందని ఈయన నోటి దూల కారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు రావడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా అందుకోలేరని, ఈయనకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ టీం నిరాకరించింది అంటూ వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.