చాలామంది ఖర్జురాన్ని తిని వాటి గింజలను పారేస్తూ ఉంటారు.అయితే చాలామందికి ఆ గింజలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసి ఉండదు.
ఎందుకంటే ఆ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అందుకే ఖర్జూర గింజలను నేరుగా తినలేము కాబట్టి వాటిని పొడిగా చేసుకుని ఉపయోగించాలి.
ఎందుకంటే ఇందులో కాల్షియం, పొటాషియం, అసంతృప్త కొవ్వు, ఆమ్లాలు అధికంగా ఉన్నాయి.అందుకే డిఎన్ఎ దెబ్బ తినకుండా ఇది నిరోధిస్తుంది.
అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.ఇక ఖర్జూరంలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వలన కిడ్నీలు, కాలేయం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయి.ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ తో ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేసి చర్మ సమస్యలను అలాగే జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి.అయితే అతి ముఖ్యంగా తెల్ల జుట్టును కూడా ఖర్జూరం నివారిస్తుంది.
ఖర్జూరంలో యాంటీ యాక్సిడెంట్ సమృద్ధిగా ఉండడం వలన శరీరం యొక్క డిఎన్ఏ నిర్మాణాన్ని రక్షిస్తుంది.
అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది.
ఇక ఇది డయాబెటిస్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
ఇక ఖర్జూరం గింజల పొడి ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలను కలిగి ఉండడం వలన వారం రోజులు పాటు ఈ పొడిని వాడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా దరికి రావు.
అంతేకాకుండా దీర్ఘకాలిక విరోచనాలకు కూడా చికిత్సగా ఇది సహాయపడుతుంది.

ఎందుకంటే ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది.అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండడం వలన యాక్సిడెంట్ మెరుగుదలకు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.అలాగే సాంప్రదాయ వైద్యంలోనూ ఎక్కువగా వాడుతారు.
ఇక చాలామంది ఈ పౌడర్ ని కాఫీ లో, టీలో కూడా కలిపి తీసుకుంటారు.ఇక మరికొందరు స్మూతీలోనూ, కేక్ టాపింగ్ లోనూ కూడా ఉపయోగిస్తారు.
ఎందుకంటే దీని నుంచి టేస్ట్ మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి.