టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ -1 ప్రభావం పడింది.షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.
అయితే తాజాగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో డీటెల్స్ ను ఆయన కార్యదర్శి పోలీసులకు అందించారు.
అయితే రోడ్ షోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.అనుమతి లేకుండా పర్యటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు పూర్తి వివరాలను పరిశీలించి నిర్ణయం చెబుతామని స్పష్టం చేశారు.