నీరసం, బద్ధకం.తరచూ వేధించే కామన్ సమస్యలు ఇవి.
ఈ రెండూ చిన్న సమస్యలే అయినప్పటికీ.నిర్లక్ష్యం చేస్తే వాటి వల్ల మనలో ఉండే మూడు, ఉత్సాహం అన్నీ ఎగిరి పోతుంటాయి.
ఎప్పుడూ డల్‌గానే ఉంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.
అలాగే మరెన్నో సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే నీరసం, బద్ధకం వంటి సమస్యలను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతుంటారు.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ ఫ్యాట్ లెస్ మిల్క్‌ను పోసి బాగా మరిగించి చల్లారబెట్టుకోవాలి.అలాగే ఓ రెండు తొక్క తీసేసిన అరటి పండ్లను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్‌లో కాచి చల్లార్చిన పాలు, కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, ఐదు జీడిపప్పులు, మూడు యాలకులు, రెండు టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి వేసి బ్లెండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో నానబెట్టుకున్న సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన అరటి పండు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపితే సరిపోతుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్‌ను తీసుకుంటే గనుక ఎలాంటి నీరసమైనా, ఎంతటి బద్ధకమైనా పరార్ అవ్వడం ఖాయం.పైగా ఈ జ్యూస్‌ను వారంలో మూడు లేదా నాలుగు సార్లు తాగడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.ఒంట్లో అధిక వేడి మాయం అవుతుంది.శరీరానికి కావాల్సిన బోలెడన్ని పోషకాలు లభిస్తాయి.అతి ఆకలి తగ్గు ముఖం పడుతుంది.మరియు రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.