నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)

సాధారణంగా మనం అందరం కూడా ఎక్కువగా తాజా కూరగాయలను, పండ్లను వీధి బండ్ల మీద కొనుగోలు చేస్తూ ఉంటాము.అంతే కాకుండా మార్కెట్లో ఎక్కడ చూసినా బండ్ల మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Fruit Trade With Urine Stained Hands, Fruit Vendor, Urinates ,bag, Sells Fruits-TeluguStop.com

అయితే వారు అందరూ కూడా సరైన శుభ్రత పాటిస్తారని నమ్మకం లేదు.ఎందుకు అంటే.

కొంత మంది చాలా శుభ్రంగా కూరగాయలు పండ్లను అమ్ముతూ ఉండగా.మరికొందరు అయితే వారు చేసే విచిత్ర పనులు అందరినీ ఆగ్రహానికి గురి చేస్తాయి.

గడిచిన కొన్ని రోజుల క్రితం ఒక జ్యూస్ షాప్ లో ఒక వ్యక్తి మూత్రం కలిపి అమ్ముతున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.తాజాగా అలాంటి సంఘటననే మరొకటి మహారాష్ట్రలోని ముంబైలో( Mumbai, Maharashtra) చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే.ముంబైలోని డోంబివిలీలోని నీలేజ్ గ్రామంలో( Neelage village of Dombivli ) ఒక దారుణమైన సంఘటన జరిగింది.నీలేజ్ గ్రామంలో ఒక పండ వ్యాపారి పండ్లను అమ్ముతున్న క్రమంలో ప్లాస్టిక్ బాటిల్ లో మూత్ర విసర్జన చేస్తూ పండ్లను అమ్మడం మనం చూడవచ్చు.ఈ వ్యక్తి చేసిన దారుణమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అమ్ముతూ ఇలాంటి దారుణం చేయడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చివరికి మానుపాడు పోలీసుల వద్దకు చేరి పండ్ల విక్రతను అదుపులోకి తీసుకొన్నారు.అంతేకాకుండా పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన కొంతమంది యువకుడి తీరుపై మండి పడటంతో పాటు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా బయట తీసుకున్న కూరగాయలు గాని పండ్లు కానీ ఇంటికి వెళ్ళాక కచ్చితంగా వాటిని శుభ్రపరిచి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.లేకపోతే కచ్చితంగా ఆసుపత్రి పాలు కావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube