తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు( Directors ) చాలామంది ఉన్నారు.నిజానికి వీళ్లు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లో మన దర్శకులు వాళ్ళ హవాని చూపిస్తూ ముందుకు సాగుతున్నార.ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి( Kollywood ) చెందిన కొంతమంది దర్శకులు మాత్రం పాన్ ఇండియాలో వాళ్ళ సినిమాలను చేయలేక ఓన్లీ తమిళ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యే కథలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.

మరి ఈ దర్శకులు పాన్ ఇండియాలో( Pan India ) సినిమాలను చేయలేరా ఒకవేళ చేసిన అవి ఆడవనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారా? అనే విషయాల మీద స్పష్టత అయితే లేదు.నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రియలేస్టిక్ సినిమా మేకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బాలా…( Director Bala ) ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి…ఇక ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ చాలామంది ఈయన మీద పొగడ్తల వర్షం కురిపించారు.కానీ ఈయన మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా మాత్రం చేయలేకపోయాడు.

తమిళ్ సినిమాలను చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు…మరి ఇలాంటి సందర్భంలో ఈయన నుంచి వచ్చే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ప్రస్తుతం బాలా మరో సంచలనాత్మకమైన సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…ఇక ఇప్పటికే ఆయన భారీ సక్సెస్ లను అందుకున్నాడు…
.