బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) ఆయన మాజీ భార్య కిరణ్ రావు( Kiran Rao ) దంపతుల గురించి మనందరికీ తెలిసిందే.వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ దంపతులు విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే.అసిస్టెంట్ డైరెక్టర్ గా లగాన్ మూవీ దగ్గరనుంచి అమీర్ ఖాన్ నటించిన చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది.
ఆ తర్వాత 2011 లో అమీర్ ఖాన్ హీరోగానే ధోభీ ఘాట్ అనే చిత్రంతో దర్శకురాలిగా మారిన కిరణ్ రావు.ఇక గత సంవత్సరం సెప్టెంబర్ లో లాపతా లేడీస్ తో( Laapataa Ladies ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రావు సందర్భంగా ఆమె మాట్లాడుతూ.2025 ఆస్కార్ అవార్డుల్లో( 2025 Oscar Awards ) భారతదేశం తరుపున అధికార ప్రవేశానికి లాపతా లేడీస్ అర్హత సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది.ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు చిత్ర బృందం మొత్తం కోరిక.ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తన వంతు బాధ్యతగా ఆస్కార్ కి పంపిస్తుదనే నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారయ్యే సంఘటనలని ఇతివృతంగా చేసుకొని లాపతా లేడీస్ తెరకెక్కగా నీతాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీ వాత్సవ,రవి కిషన్, ఛాయా కదమ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.అమిర్ ఖాన్ ఈ మూవీని నిర్మించారు.తాజాగా సుప్రీం కోర్టు డెబ్భై ఐదేళ్ల వేడుకల్లో భాగంగా కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లో లాపతా లేడీస్ ని ప్రదర్శించారు.