కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పులకు మనం నష్టపోతుంటాం.అది కూడా తెలియకుండా.
చివరకు అసలు నిజం తెలుసుకుని షాక్ అవుతుంటాం.అలాంటి ఓ అనుభవం అమెరికాలోని కాలిఫోర్నియా( California ) రాష్ట్రంలో నివసిస్తున్న కెన్ విల్సన్‌కు ఎదురయింది.
కెన్ విల్సన్ ( Ken Wilson )ఇటీవల తన ఇంటి విద్యుత్ బిల్లు చాలా ఎక్కువగా ఉందని గమనించాడు.దీంతో తన బిల్లును తగ్గించాలని నిర్ణయించుకున్నాడు.
అప్పుడే తాను గత 20 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంట్ బిల్లు చెల్లిస్తున్నానని తెలిసింది.దాంతో అవాక్కు అవ్వడం అతని వంతు అయింది.
విద్యుత్ మీటర్లలో ఏదో ఒక తప్పు వల్ల, కెన్ విల్సన్ తన ఇంటికి బదులు, తన పక్కింటి వారి ఇంటి విద్యుత్ బిల్లును 2009 నుంచి చెల్లిస్తున్నాడు.ఇంతకాలం తాను తప్పుడు వ్యక్తికి డబ్బు చెల్లిస్తున్నానని ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యకరం.
కెన్ విల్సన్ మాట్లాడుతూ, తనకు ఏదో పొరపాటు జరుగుతున్నట్లుగా అనిపించిందని, విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువగా వస్తున్నందున తన వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.
“నేను నా మీటర్‌ని చూడడానికి ఎన్నోసార్లు బయటకు వెళ్లాను… నాకే అది నమ్మశక్యంగా లేదు.” 2006 నుంచి అదే ఇంట్లో నివసిస్తున్న కెన్ విల్సన్, తన విద్యుత్ బిల్లు ఎందుకు ఇంత ఎక్కువగా ఉందో అర్థం కాక పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీ( Pacific Gas and Electric Company ) (PG&E) వెబ్‌సైట్‌ని చెక్ చేశాడు.“ఏదో తప్పు జరుగుతుందని నాకు తెలుసు.మా ఇంట్లో ఏదైనా లీకేజ్ ఉండొచ్చు, ఎవరైనా మా విద్యుత్‌ని దొంగతనం చేస్తుండొచ్చు లేదా మీటర్‌లో ఏదైనా లోపం ఉండొచ్చు.” అని అనుకున్నానని చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో, తన మీటర్‌ని తాను కంట్రోల్ చేయలేక “శక్తిహీనుడిగా” అనిపిస్తుందని విల్సన్ చెప్పాడు.చివరకు మీటర్లలో పొరపాటు కారణంగా, విల్సన్ తన సొంత యూనిట్ 90కి బదులుగా యూనిట్ 91కి విద్యుత్ కోసం చెల్లిస్తున్నాడని తేలింది.PG&E ఈ తప్పుకు క్షమాపణ చెప్పింది.తమ తప్పు వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చాలా బాధపడుతున్నామని మీడియాకు తెలిపింది.తమ తప్పును అంగీకరించి, విల్సన్‌కు ఈ సమస్యను సరిచేస్తామని హామీ ఇచ్చింది.PG&E ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విల్సన్ మీటర్‌ను సరిచేశామని, ఆయన అకౌంట్‌లో 600 డాలర్లకు పైగా క్రెడిట్ చేశామని తెలిపారు.
ఇకపై విల్సన్ తన వాటా బిల్లు మాత్రమే చెల్లించాలి.విల్సన్ తన కథ ఇతరులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాడు.
తమ మీటర్ నంబర్లను సరిచూసుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చాడు.PG&E కూడా వినియోగదారులు తమ మీటర్ ఐడీని బిల్లుతో పోల్చాలని సూచించింది.