మన ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడే అన్ని కూరగాయలలో బీట్రూట్ కూడా ఒకటి.బీట్రూట్ భూమి లోపల పండించే పంట.
ఈ బీట్రూట్లను ఎక్కువగా సలాడ్స్ లలో ఉపయోగిస్తూ ఉంటారు.అయితే ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.
బీట్రూట్లో డైటారి ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అంటే ఎన్నో పోషకాలు ఉన్నాయి.అయితే బీట్రూట్ ను జ్యూస్గా చేసుకుని కూడా తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయటపడవచ్చు.భారతదేశంలో చాలా మంది ప్రజలు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటారుముఖ్యంగా ఓపెన్ యూరిన్, మూత్రంలో మంట మొదలైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే బీట్రూట్ జ్యూస్ ను కచ్చితంగా తాగాలి.
ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగితే ఇంకా ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి.

ప్రస్తుత సమాజంలో మారిన జీవనశైలి కారణంగా అనారోగ్య కరమైన ఆహారాల వల్ల పొట్ట చుట్టూ చెడు కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.అయితే బరువును తగ్గించుకోవడానికి ప్రతి రోజు డైటరి ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.అయితే దీనికోసం బీట్రూట్ జ్యూస్ కూడా త్రాగవచ్చు.బీట్రూట్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీట్ రూట్ జ్యూస్ ని ఉదయం పరిగడుపున త్రాగడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.
అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ రసం త్రాగడం వల్ల బయటపడవచ్చు.కాబట్టి ఈ జ్యూస్ ను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇలా క్రమం తప్పకుండా బీట్రూట్ రసం తాగడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి.అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.







